Please log in to earn points for visiting this page.
ఇప్పుడు మనం పైథాన్ లో ఉండే వైల్ లూప్స్ గురించి తెలుసుకుందాం.
పైథాన్ లూప్స్ మనకు పైథాన్ లో రెండు ప్రేమిటివ్ లూప్ ఆదేశాలు అంటే కమాండ్స్ ఉన్నాయి : అవి
అని రెండు లూప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వైల్ లూప్ గురించి తెలుసుకుందాం.
వైల్ లూప్‌తో (while) మనం ఇచ్చిన కండిషన్ నిజం ట్రూ అయ్యే వరకు స్టేట్మెంట్లను ఎగ్జిక్యూట్ చేస్తుంది. మేము ఐ అనే variable తీసుకోని దానికి value గా 1 అసైన్ చేసాము. ఇక్కడ వైల్ లూప్ ను యూజ్ చేసి కండిషన్ ను అప్ప్లయ్ చేసాము. ఆ కండిషన్ ఏమిటంటే i యొక్క value 10 వరకు మాత్రమే ప్రింట్ చేయమని. దానికంటే ఎక్కువ అయినప్పుడు వైల్ లూప్ నుండి బయటకు రమ్మని ఆ కండిషన్ యొక్క అర్థం. ఇప్పుడు i యొక్క value ను పెంచుకుంటు పోతున్నాము (ఇంక్రిమెంట్ ). ఎప్పటిదకంటే i యొక్క value 6 వచ్చేంత వరకు.
మేము ఇక్కడ 10 కంటే తక్కువ ఉన్నంత వరకు i ని ప్రింట్ చేస్తున్నాము :
Note: ఇక్కడ i ని ఇంక్రిమెంట్ చేయాలని గుర్తుంచుకోండి, లేదంటే లూప్ ఎప్పటికీ కూడా కొనసాగుతు ఉంటుంది.
అయితే while loop కి సంబందించిన వేరియబుల్స్ సిద్ధంగా ఉండాలి. మేము ఈ ఉదాహరణలో 1కి సెట్ చేసిన ఇండెక్సింగ్ వేరియబుల్, iని డిఫైన్ చేసాము.
break statement తో మనం లూప్‌ను ఎక్కడ కావాలంటే అక్కడ ఆపివేయవచ్చు, అయితే కండిషన్ నిజమే అయినప్పటికీ కూడా ఇది చేయవచ్చు : అంటే పైన example లో 10 వరకు ప్రింట్ చేసాము. కానీ ఇప్పుడు 5 వరకు మాత్రమే ప్రింట్ చేస్తాము. అది కూడా పైన example లో ఇచ్చిన కండిషన్ ను అప్ప్లయ్ చేస్తూ.. కానీ if బ్లాక్ ను యూజ్ చేస్తాము. ఈ బ్లాక్ లో కండిషన్ : i value ఎప్పుడైతే 5 వస్తుందో అప్పుడు ఆ while loop నుండి బయటకు వచ్చెయ్యాలి. అంటే 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. కండిషన్ 10 వరకు ఉన్నా కూడా.. ఎందుకంటే if బ్లాక్ లో మరో కండిషన్ ను ఇచ్చాము కాబట్టి ఆ కండిషన్ ట్రూ అయిన్నప్పుడు while loop నుండి బయటకు వస్తుంది.
5 అయినప్పుడు లూప్ నుండి నిష్క్రమించు :
పైన example లో వరకు మాత్రమే ప్రింట్ చేసాము. కానీ ఇప్పుడు 5 ను మాత్రమే ప్రింట్ చేయ్యకుండా మిగతావన్నీ కూడా ప్రింట్ చేయాలి. ఎలా ? దీని కోసం మనం continue అనే కీవర్డ్ ను యూజ్ చేస్తాము.
అంటే పైన example లో 5 వరకు ప్రింట్ చేసాము. కానీ ఇప్పుడు 5 మాత్రమే వదిలేసి ప్రింట్ చేస్తాము. అది కూడా పైన example లో ఇచ్చిన కండిషన్ ను అప్ప్లయ్ చేస్తూ.. కానీ ఇక్కడ కూడా if బ్లాక్ ను యూజ్ చేస్తాము. ఈ బ్లాక్ లో కండిషన్ : i value ఎప్పుడైతే 5 వస్తుందో అప్పుడు ఆ while loop నుండి బయటకు రాకుండా ఎక్కడ కండిషన్ ట్రూ అవుతుందో దానిని మాత్రమే ప్రింట్ చెయ్యకుండా అలాగే లూప్ రన్ చేయడం. అంటే 5 మాత్రమే ప్రింట్ కాకుండా లూప్ ను రన్ చేస్తాము. కండిషన్ 10 వరకు ఉంటూ.. ఎందుకంటే if బ్లాక్ లో continue అనే కీవర్డ్ ను ఇచ్చాము కాబట్టి ఆ కండిషన్ ట్రూ అయిన్నప్పుడు while loop నుండి బయటకు రాకుండా పైన వైల్ లూప్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రన్ అవుతుంది.
ఇక్కడ 5 ను వదిలేసి మిగతావన్నీ కూడా ప్రింట్ అవుతాయి.
మనం ఇచ్చిన కండిషన్ ట్రూ కానప్పుడు వేరే స్టేట్మెంట్ ను రాసి మనం కోడ్ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి else అనే దానిని యూజ్ చేస్తాము :
ఇక్కడ కండిషన్ తప్పు. అందుకే తర్వాత సందేశాన్ని ప్రింట్ చేస్తున్నారు :