Please log in to earn points for visiting this page.
ఈ పైథాన్ ట్యుటోరియల్ ( Python tutorial) అసలు ఏమి తెలియని వారిని దృష్టి లో పెట్టుకొని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్ నుండి అడ్వాన్స్ విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి మేము W3Badi వెబ్సైటు లో తెలుగు లో వ్రాయబడింది. ఈ ట్యుటోరియల్ని పూర్తి చేసిన తర్వాత, మీరు పైథాన్‌లో ఉన్న నైపుణ్యం యొక్క గొప్ప స్థాయిని తెలుసుకొంటారు. ఇక్కడ నుండి ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి మిమ్మల్ని మీరు తదుపరి స్థాయిలకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది.
పెర్ల్ వలె, పైథాన్ సోర్స్ కోడ్ కూడా GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ (GPL) క్రింద అందరికి అందుబాటులో ఉంది.
ఈ పైథాన్ ప్రొసీడ్యూరల్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ మరియు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో సహా బహుళ ప్రోగ్రామింగ్ నమూనాలకు కూడా మద్దతు ఇస్తుంది. పైథాన్ డిజైన్ ఫిలాసఫీ అనేది ముఖ్యమైన ఇండెంటేషన్‌ని ఉపయోగించడంతో కోడ్ రీడబిలిటీని నొక్కి నొక్కి చెబుతుంది.
ఈ తెలుగు పైథాన్ ట్యుటోరియల్ బేసిక్ నుండి అడ్వాన్స్ విషయాల వరకు పైథాన్ ప్రోగ్రామింగ్ భాషపై పూర్తి అవగాహనను మీకు అందిస్తుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మేము రాసిన ఈ ట్యుటోరియల్ మిమ్మల్ని సింపుల్ విధానాల మరియు ప్రాక్టికల్ విధానాల ద్వారా ముందుకు తీసుకువెళ్తుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
పని చేయడానికి గొప్ప పైథాన్ లో మంచి నాలెడ్జి ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. అప్పుడు ఈ సమయానికి మాత్రం పైథాన్ ప్రోగ్రామర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటిలో అప్లికేషన్ కారణంగా మార్కెట్ లో ఏక్కువ సంఖ్యలో పైథాన్ ప్రోగ్రామర్లు అవసరం అని తెలియజేస్తుంది. తెలుగు లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యుటోరియల్స్ ను ఫ్రీగా మేము మా W3Badi వెబ్సైటు లో అందుబాటులో ఉంచాము.
పైథాన్ ప్రోగ్రామర్ కు వార్షిక ప్యాకేజీ ఎంత ? ( What is the annual package for a Python programmer ? )
నేడు కనుక చుస్తే (2023) 3-5 సంవత్సరాల అనుభవం ఉన్న పైథాన్ ప్రోగ్రామర్ కు సుమారు $150,000 వార్షిక ప్యాకేజీని ఉంది. అయితే ఇది అమెరికాలో అత్యంత డిమాండ్ ఉన్న టాప్ ప్రోగ్రామింగ్ భాష అని చెప్పవచ్చు. అయితే ఉద్యోగం యొక్క స్థాయిని బట్టి ఈ వార్షిక ప్యాకేజీ మారవచ్చు. పైథాన్‌ని ఉపయోగిస్తున్న కోన్ని పెద్ద కంపెనీల పేర్లు :
ఇంకా ఎన్నో... దీనిని ఉపయోగిస్తున్నాయి. అన్నింటిని మీకు తెలియజేయాలంటే ఈ పేజీ సరిపోదు. కాబట్టి, మీరు ఈ ప్రధాన కంపెనీలలో దేనికైనా సరే ఒక ఉద్యోగి కావచ్చు. ఈ సింపుల్ గా తెలుగు బాషా లో మరియు ప్రభావవంతమైన ట్యుటోరియల్ని ఉపయోగించి ఎక్కడి నుండైనా మరియు ఎప్పుడైనా మీకు సమయం ఉన్నప్పుడల్లా వేగంగా పైథాన్ నేర్చుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించండి.
మీకు కూడా ఈ ప్రశ్న వచ్చిందా ? అయితే మేము కొన్ని మంచి కారణాలు తెలియజేస్తాము అప్పుడు ఈ ప్రశ్నకు మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటిగా పైథాన్ స్థిరంగా ఇప్పటికి ఉంది. ఒక వేళా రేటింగ్ ఇస్తే 5కి 5 వస్తుంది. పైథాన్ ను నేర్చుకోవడం చాలా సులభం, అందుకే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ భాష నేర్చుకోవాలనుకుంటే, పైథాన్ ఒక మంచి ఎంపిక అవుతుంది. తెలుసా ? నేడు వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వారి ప్రాథమిక ప్రోగ్రామింగ్ భాషగా పైథాన్‌ను తమ విద్యార్థలుకు బోధిస్తున్నాయి. ఏ ప్రోగ్రామర్కైనా పైథాన్‌ను 1st ఎంపికగా చేయడానికి అనేక ఇతర మంచి కారణాలు కూడా ఉన్నాయి అవి ఇవి :
విద్యార్థులు గాని మరియు పని చేసే నిపుణులు గాని ప్రత్యేకంగా వెబ్ డెవలప్మెంట్ డొమైన్లో వర్క్ చేస్తున్నప్పుడు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావలనుకొనే వారికీ పైథాన్ లాంగ్వేజ్ తప్పనిసరిగా అవసరం. పైథాన్ నేర్చుకోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలను మీకు తెలియజేస్తాము : అవి ఇవి
పైథాన్ గురించి చక్కగా మరియు ఎక్కువ నాలెడ్జి తెలుసుకుంటే, మీరు ముందుకు మంచి కెరీర్లో స్థిరపడవచ్చు. పైథాన్ కీలక నైపుణ్యం కలిగిన కొన్ని కెరీర్ ఎంపికలు మేము ఇక్కడ మీకోసం తెలియజేస్తాము : అవి ఇవి
మరెన్నో ఇతర పాత్రలు
పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఇవి :
పైథాన్ C, C++, COM, CORBA మరియు Javaతో చాలా సులభంగా అనుసంధానించబడుతుంది ( అంటే ఇంటిగ్రేట్ అవుతుంది ).
పైథాన్ యొక్క తాజా వెర్షన్ - 3.x. మేము ముందు చెప్పినట్లుగా, వెబ్‌లో ఎక్కువగా ఉపయోగించే భాషలలో ఇది కూడా ఒకటి. మేము వాటిలో కొన్నింటిని ఇక్కడ మీకు ఇన్ఫోర్మ్ చేస్తాము : అవి ఇవి
Extensibility ఎక్స్టెండ్ బుల్ అవ్వడం - పైథాన్ ఇంటర్ప్రెటర్కు తక్కువ-స్థాయి మాడ్యూల్లను కూడా జోడించవచ్చు. ఈ మాడ్యూల్స్ ప్రోగ్రామర్లు తమ సాధనాలను మరింత సమర్థవంతంగా జోడించడానికి లేదా అనుకూలీకరించడానికి చాలా వీలు కల్పిస్తాయి. Availability of databases డేటాబేస్లు ఉండటం - పైథాన్ అన్ని ప్రధాన వాణిజ్య డేటాబేస్లకు ఇంటర్‌ఫేస్‌లను కూడా అందిస్తుంది. GUI Programming GUI ప్రోగ్రామింగ్ - Windows MFC, Macintosh మరియు Unix యొక్క X విండో సిస్టమ్ వంటి అనేక సిస్టమ్ కాల్లు, లైబ్రరీలు మరియు విండోస్ సిస్టమ్‌లకు సృష్టించబడే మరియు పోర్ట్ చేయగల GUI అప్లికేషన్లకు ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. Being scalable స్కేలబుల్ గా ఉండటం - షెల్ స్క్రిప్టింగ్ కంటే పెద్ద ప్రోగ్రామ్‌లకు మెరుగైన నిర్మాణం మరియు సపోర్ట్ ను కూడా అందిస్తుంది.
ఫ్రెండ్స్ మేము ఈ ట్యుటోరియల్స్ ను develop చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మీకు ఒక వేళా ఈ ట్యుటోరియల్స్ వల్ల కొంతలో కొంత మాకు use అయ్యింది అని మీరు ఫీల్ అయ్యింటే మాత్రం మీ తెలిసిన వారందరికీ షేర్ చేసి మా Website గురించి తెలియజేయండి. ఇదే మా హార్డ్ work కు మీరిచ్చే అద్భుతమైన బహుమతి అవుతుంది.