Python Syntax in Telugu
Python Comments ( పైథాన్ వ్యాఖ్యలు ) : -
- పైథాన్ కోడ్‌ను వివరించడం కోసం అని ఈ కామెంట్స్ ను ఉపయోగించవచ్చు.
- రాసిన కోడ్‌ను మరింత చదవగలిగేలా చేయడం కోసం అని ఈ కామెంట్స్ ను ఉపయోగించవచ్చు.
- రాసిన కోడ్‌ని పరీక్షించేటప్పుడు అమలును నిరోధించడం కోసం అని ఈ కామెంట్స్ ను ఉపయోగించవచ్చు.
Comments ను తెలుగులో "వ్యాఖ్యలు" అని అంటారు.
పైథాన్‌లో రాసిన ఈ కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వని కోడ్ లైన్లు అని చెప్పవచ్చు.
మరి వీటిని ఎందుకోసం ఉపయోగిస్తారు ?
వీటిని ప్రాజెక్ట్ లో రాసిన కోడ్ దేని కోసం , ఎలాంటి రిజల్ట్స్ కోసం దేనిని డెవలప్ చేశామో అనే దానిని రాసిన మీకు మీ కోసం గాని లేదా ఇతరుల కోసం గాని ఉపయోగిస్తారు. Ex : మీరు ఇప్పుడు 2 + 2 = ? అనే దాని కోసం పైథాన్ లో కోడ్ రాస్తారు. ఇది కోడింగ్ లో ఎలా రాస్తే 4 అనే result వస్తుంది అని అప్పటికి లేదా కొంత వరకు మీకు గుర్తుంటుంది అనుకుందాం.
అయితే కొన్ని రోజులు తరువాత ఏదో ఒక ప్రాబ్లం వల్ల సరిగ్గా ఆ కోడ్ పని చేయలేదని అనుకుందాం. ఇప్పుడు మీరు దానిని సరి చేయడానికి మీ ప్రాజెక్ట్ లో రాసిన కోడ్ ను టెస్ట్ చేస్తారు.
కానీ కోడింగ్ లో ఎలా రాస్తే 4 అనే result వస్తుంది అనే లాజిక్ గుర్తుకు రావటం లేదనుకోండి. మరి ఇప్పుడు ఏమి చేయాలి ? మీరే థింక్ చేయండి ఫ్రెండ్స్ ? అయితే ఇలా కాకుండా ఉండటం కోసం కోడింగ్ లో ఎలా రాస్తే 4 అనే result వస్తుంది అనే లాజిక్ ను కామెంట్స్ రూపం లో రాస్తే feature లో ఇలాంటి problem రాకుండా ఉంటుంది. అంతే కాకుండా మీరు రాసిన ప్రాజెక్ట్ ను తర్వాత తీసుకొనే వారికీ fast గా అర్థం మరియు చదవడం కోసం యూజ్ అవుతుంది.
పైథాన్‌లో రెండు రకాల కామెంట్స్ (Two Types of Comments in Python ):
అయితే పైథాన్‌లో 2 రకాల కామెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటంటే :
- సింగిల్-లైన్ కామెంట్స్ ( Single-line comments )
- బహుళ-లైన్ కామెంట్స్ ( Multi-line comments )
సింగిల్-లైన్ కామెంట్స్ అంటే ఏమిటి ?
వీటిని కేవలం ఒకే ఒక లైన్ లో లాజిక్ ను గాని లేదా ఇతర విషయాలను గాని చెప్పాలన్నపుడు use చేస్తారు. ఇవి హాష్ గుర్తు (#)తో ప్రారంభం అవుతాయి, చివర వరకు వెళ్తాయి. అంటే మీరు ఒకే ఒక లైన్ లో కామెంట్స్ ను use చేయాలన్నపుడు మొదట హాష్ గుర్తు (#)తో ప్రారంభించాలి. ఈ క్రింది విధంగా .....
సింగిల్-లైన్ కామెంట్స్ ( Single-line comments ) కు ఇక్కడ ఉదాహరణ:
మల్టీ-లైన్ కామెంట్స్ అంటే ఏమిటి ?
వీటిని 1 కంటే ఎక్కువ లైన్ లలో లాజిక్ ను గాని లేదా ఇతర విషయాలను గాని చెప్పాలన్నపుడు use చేస్తారు. ఇవి మూడు డబుల్ కోట్లతో (""") లేదా మూడు సింగిల్ కోట్లతో (''') ప్రారంభమై అదే మూడు కోట్లతో ముగుస్తాయి. అంటే మీరు 1 కంటే ఎక్కువ లైన్ లలో కామెంట్స్ ను use చేయాలన్నపుడు మొదట 3 డబుల్ కోట్లతో (""") లేదా 3 సింగిల్ కోట్లతో (''')తో ప్రారంభించి అవే మూడు కోట్లతో ముగించాలి. అంటే ఈ క్రింది విధంగా .....
మల్టీ-లైన్ కామెంట్స్ ( Single-line comments ) కు ఇక్కడ ఉదాహరణ:
మల్టీ-లైన్ కామెంట్స్ ను రాయడానికి మీరు ప్రతి లైన్ కి కూడా #తో ప్రారంభించవచ్చు:
ఉదాహరణ:
అసలు కోడ్ ఏమి చేస్తుంది, ఎందుకు చేస్తుంది లేదా ఎలా పని చేస్తుందో వివరించడానికి ఈ కామెంట్స్ ను ఉపయోగించవచ్చు. మీ కోసం గాని లేదా ఇతర డెవలపర్ల కోసం గాని గమనికలను ఉంచడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు.
అయితే ఈ కామెంట్స్ ను రాయడానికి మంచి పద్ధతులు ఏవి ?
వీటిని రాయడానికి ఇక్కడ కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి :
- మీరు పూర్తి వాక్యాలను ఉపయోగించండి.
- అయితే మీరు specific గా మరియు informative గా ఉండండి.
- పరిభాష మరియు సాంకేతిక పదాలను నివారించండి.
- మీరు మీ కోడ్‌కు మార్పులు చేసినప్పుడు గాని మీ వీటిని అంటే కామెంట్స్ ను Update చేయండి.
ఇక్కడ ఒక మంచి కామెంట్స్ కు ఉదాహరణ :
ఇక్కడ ఒక Bad కామెంట్స్ కు ఉదాహరణ:
ఇప్పుడు కనుక మీ ప్రాజెక్ట్ లో పైన రాసిన విదంగా కామెంట్స్ కనుక రాస్తే use లేదు. ఎందుకంటే ఇది ఫంక్షన్ ఏమి చేస్తుందో లేదా ఎందుకు ముఖ్యమైనదో అసలు వివరించలేదు.
మీ కోడ్‌ను మరింత చదవగలిగేలా మరియు అర్థమయ్యేలా చేయడానికి Comments అనేవి చాలా చాలా విలువైన సాధనం అని చెప్పవచ్చు. మేము పైన తెలియజేసిన కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ కోడ్‌ను maintain చేయడం గాని మరియు మెరుగుపరచడం సులభతరం చేసే Comments ను వ్రాయవచ్చు అని గమనించండి.
Comments ను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ కొన్ని వాస్తవ-ప్రపంచ ఉదాహరణలు మేము మీ కోసం ఇక్కడ ఉంచాము :
- రుణంపై వడ్డీని లెక్కించే ప్రోగ్రామ్‌లో, యూజ్ అవుతున్న సూత్రాన్ని వివరించడానికి మీరు ఈ కామెంట్స్ ను ఉపయోగించవచ్చు.
- గేమ్ ఆడే ప్రోగ్రామ్‌లో, మీరు గేమ్ నియమాలను వివరించడానికి వీటిని ఉపయోగించవచ్చు.
- రోబోట్‌ను నియంత్రించే ప్రోగ్రామ్‌లో అయితే , రోబోట్ తీసుకోవలసిన దశలను వివరించడానికి మీరు వీటిని యూజ్ చేయవచ్చు.
Comments ను ఉపయోగించడం ద్వారా, మీరు మీ కోడ్‌ను మరింత వివరంగా అర్థమయ్యేలా మరియు maintain చేయగలిగేలా చేయవచ్చు. అయితే ఒక వేళా భవిష్యత్తులో మీ కోడ్‌పై వర్క్ చేయడం అవసరమైనప్పుడు మీకు గాని లేదా ఇతరులకు గాని చాలా simple గా చేస్తాయి ఈ కామెంట్స్. ఇవి మీ కోడ్‌ను అర్థం చేసుకోవడం గాని మరియు సహకరించడం గాని ఇతర వ్యక్తులకు చాలా సులభతరం చేస్తుంది.
