Please log in to earn points for visiting this page.
ఇప్పుడు మనం పైథాన్ ఇన్స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. అయితే మీరు మీ సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ ( Install Python ) చేయకముందు ఈ విషయం తప్పకుండ తెలుసుకుకోవాలి. ఇప్పుడు అనేక PC లు మరియు Mac లో అల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. అందుకే ముందుగా పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి.
మీ విండోస్ పిసిలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉందో లేదో చెక్ చేయడానికి, స్టార్ట్ బార్లో python అని సెర్చ్ చేయండి లేదా ఈ కమాండ్ లైన్ (cmd.exe)లో రన్ చేయండి: అంటే కమాండ్ లైన్ ఓపెన్ చేసి python అని టైప్ చేయండి స్పేస్ ఇవ్వండి.. అ తరువాత 2 సార్లు హైఫన్ (--)ఇచ్చి వెర్షన్ (version) అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ క్లిక్ చేయండి అంతే .. వెంటనే python వెర్షన్ ను చూపిస్తుంది.
మీ Linux లేదా Macలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉందో లేదో చెక్ చేయడానికి, linuxలో అయితే కమాండ్ లైన్‌ని ఓపెన్ చేయండి లేదా Macలో అయితే టెర్మినల్ని ఓపెన్ చేసి python అని టైప్ చేయండి స్పేస్ ఇవ్వండి.. తరువాత 2 సార్లు హైఫన్ (--)ఇచ్చి వెర్షన్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ క్లిక్ చేయండి అంతే .. వెంటనే python వెర్షన్ ను చూపిస్తుంది.
పైన చెప్పిన విదంగా చేసిన తరువాత కూడా ఎలాంటి python వెర్షన్ ను చూపించక పోతే మీ కంప్యూటర్లో పైథాన్ ఇన్స్టాల్ చేయలేదని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే మీ సిస్టమ్ లో పైథాన్ ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానికి కోసం ఈ క్రింది ఆఫీసియల్ వెబ్సైట్ నుండి Free గా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
పైథాన్ అనేది ఒక interpreted ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు డెవలపర్‌గా పైథాన్ (.py) ఫైల్‌లను టెక్స్ట్ ఎడిటర్లో వ్రాసి, ఆ ఫైల్‌లను పైథాన్ ఇంటర్ప్రెటర్లో ఉంచి రన్ చేస్తారు.
ఈ interpreted ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటో ఒక చిన్న రియల్ లైఫ్ example తో తెలుసుకుందాం.
మీకు ఎప్పుడో ఒక్కప్పుడు ఈ విదంగా జరిగి వుండి ఉండవచ్చు. అది ఏమిటంటే మీరు పలానా డ్రస్ లు మాత్రమే కొనాలని ప్లాన్ చేసుకొని, షాపింగ్ కు వెళ్లారని అనుకోండి. అనుకోకుండా మీకు ఒక డిజైన్ నచ్చుతుంది. కానీ ఇలాంటిది మీ ప్లాన్ లో లేదు. కానీ దానిని వెంటనే కొనుకుంటారు. అంతే కదా..
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విషయంలో కూడా అంతే కంప్యూటర్ కు మీకు ఏమి కావాలో చూచనల ద్వారా తెలియజేస్తే ఎలాంటి ముందస్తు ప్లాన్ అవసరం లేకుండా, వెంటనే ఆ సూచనలను రన్ చేసి output ను ఇస్తుంది. ఇలాంటి ఫెసిలిటీ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను interpreted ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు.
పైథాన్ ఫైల్‌ను కమాండ్ లైన్లో రన్ చెయ్యడం ఎలాగో ఈ క్రింది విదంగా ఉంటుంది: ఇక్కడ "helloworld.py" అనేది మీ పైథాన్ ఫైల్ యొక్క పేరు.
ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్లో చేయగలిగే మన మొదటి పైథాన్ ఫైల్‌ను helloworld.py అని వ్రాస్దాం. ఇదే ఫైల్ యొక్క పేరు అని అనుకోకండి. ఫైల్ యొక్క పేరు మీకు నచ్చినది ఇవ్వొచ్చు. కానీ .py అనే ఏక్సటెన్షన్ మాత్రం కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఫైల్ లో ఈ క్రింది విదంగా రాసి సేవ్ చేయండి. మీ కమాండ్ లైన్ ఓపెన్ చేసి , మీరు మీ ఫైల్‌ను సేవ్ చేసిన డైరెక్టరీకి వెళ్లి చేసి, రన్ చేయండి అంతే : సేవ్ చేసిన డైరెక్టరీకి వెళ్లి రన్ చేయడం ఎలా ? ముందుగా సేవ్ చేసిన పైథాన్ ఫైల్ దగ్గరికి వెళ్ళండి. ఫైల్ explorer సెర్చ్ బార్ లో cmd అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు cmd అంటే కమాండ్ లైన్ ఓపెన్ అవుతుంది. అక్కడ అంటే కమాండ్ లైన్ లో python అని టైపు చేసి ఆ తరువాత ఫైల్ నేమ్ (.py తో ) టైపు చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు కమాండ్ లైన్ లో output ప్రింట్ అవుతుంది. ఈ క్రింది మా ఫైల్ లో Hello, World! అని ప్రింట్ చేయమని చూచనల ద్వారా తెలియజేసాము కాబట్టి Hello, World! అని కమాండ్ లైన్ లో output ప్రింట్ అయింది.
print("Hello, World!")
పైథాన్ లో తక్కువ మొత్తంలో కోడ్‌ని పరీక్షించడానికి కొన్నిసార్లు ఫైల్లో కోడ్‌ను వ్రాయకుండా ఉండటం అనేది చాలా వేగంగా మరియు సులభంగా ఉంటుంది.. అంతే కదా ఫ్రెండ్స్ . పైథాన్‌ను కమాండ్ లైన్‌గా రన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది.
Windows, Mac లేదా Linux కమాండ్ లైన్లో వీటిని టైప్ చేయండి:
లేదా, "python" అనే కమాండ్ పని చేయకపోతే, మీరు "py"అనే కమాండ్ ని ట్రై చెయ్యవచ్చు:
ఇప్పుడు మేము రాసిన హలో వరల్డ్ ఉదాహరణతో సహా ఏదైనా పైథాన్‌ని వ్రాయవచ్చు:
ఇది "హలో, వరల్డ్!" కమాండ్ లైన్లో:
మీరు పైథాన్ కమాండ్ లైన్లో పూర్తి చేసినప్పుడల్లా, పైథాన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుండి బయటకు వెళ్ళడానికి మీరు క్రింది దానిని టైప్ చేయవచ్చు: