Python Variables in Telugu
Variables ( వేరియబుల్స్ ) :
వేరియబుల్స్ అనేవి ఏదైనా డేటా విలువలను నిల్వ చేయడానికి ఒక రూమ్ లాంటిది అని చెప్పవచ్చు.
Creating variables (వేరియబుల్స్ create చేయడం ) :
వేరియబుల్ని create చేయడానికి పైథాన్‌కు ఎలాంటి command కూడా (అంటే ఆదేశం) లేదు.
అయితే మీరు మొదట దానికి ఒక విలువను కేటాయించిన క్షణంలో వేరియబుల్ సృష్టించబడుతుంది. Example : x = 5
y = "John"
print(x)
print(y)
వేరియబుల్స్ ఏదైనా నిర్దిష్ట రకంతో (అంటే specific type ఇది అని ) ప్రకటించాల్సిన అవసరం లేదు. అయితే మీరు అవి సెట్ చేయబడిన తర్వాత కూడా వాటి రకాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది.
Casting (తారాగణం ) :
ఒక వేళా మీరు కనుక వేరియబుల్ యొక్క డేటా రకాన్ని పేర్కొనాలనుకుంటే, ఇది కాస్టింగ్‌తో సులబంగా చేయవచ్చు.
Get the Type :
ఒక వేళా మీరు కనుక వేరియబుల్ యొక్క డేటా రకాన్ని తెలుసుకోవాలనుకొంటే, ఈ టైప్() ఫంక్షన్‌తో వేరియబుల్ యొక్క డేటా రకాన్ని పొందవచ్చు. అంటే
Ex :
x = 2 అనుకోండి. ఇప్పుడు ఇది ఒక variable అవుతుంది. ఇక్కడ x అనేది variable యొక్క name అవుతుంది, 2 అనేది అ variable యొక్క value అవుతుంది. మరి ఈ x అనే variable ఎలాంటి డేటా టేపు అని తెలుసుకోవాలనుకున్నపుడు ఈ టైప్() ఫంక్షన్ ను use చేస్తారు.
Single or Double Quotes (సింగిల్ లేదా డబుల్ కోట్లు )?
వీటి వల్ల String variables ను create చేయడం కోసం use చేస్తారు. అంటే
సింగిల్ లేదా డబుల్ కోట్లను ఉపయోగించడం ద్వారా స్ట్రింగ్ వేరియబుల్స్ create చేయవచ్చున్న మాటా !
Case-Sensitive ( కేస్-సెన్సిటివ్ ) :
Case-Sensitive అంటే ఒక example తో తెలుసుకుందాం.
Ex :
- A = 10 అనేది ఒక variable అనుకోండి.
- a = 10 అనేది మరొక variable అనుకోండి.
ఇప్పుడు పై రెండూ కూడా ఒకటే అని మీకు అన్పిస్తుందా ? అయితే ఈ రెండూ కూడా ఒకటి కాదు. ఎందుకంటె మొదటి variable name క్యాపిటల్ అక్షరం తో ఉంది. మరి 2 వ variable name అయితే small అక్షరం తో ఉంది. కాబట్టి ఈ రెండూ కూడా వేరు వేరు.
అంటే A = 10 అనే variable వేరు మరియు a = 10 అనే variable వేరు అవుతుంది. అందుకే వేరియబుల్ పేర్లు కేస్-సెన్సిటివ్ అవుతాయి.
