Please log in to earn points for visiting this page.
మనం నేర్చుకుంటున్న ఈ Python లాంగ్వేజ్ లో ఏదైనా ఒక variable string అయితే, అప్పుడు అ string అనేది ఒకే కొటేషన్ గుర్తులు లేదా డబుల్ కొటేషన్ గుర్తులతో ఉంటుంది.
'hello' అనేది ఒక string అవుతుంది. అవునా కదా ! ఇప్పుడు ఇది ఒకే కొటేషన్ గుర్తులు కలిగి ఉంది. అయితే "hello" అనేది మాత్రం డబుల్ కొటేషన్ గుర్తులతో ఉంది. మరి ఇప్పుడు ఇది string ? కదా ? మీకు మీరే చెప్పుకోండి. అయితే ఇది కూడా ఒక string అవుతుంది.
మీరు ప్రింట్() ఫంక్షన్‌తో literal (లిటరల్ ) గా String ను Print చేయవచ్చు :
పైన Example లో రెండు కూడా string వేరియబుల్స్ . వీటిని literal (లిటరల్ ) గా Print చేయవచ్చు.
మరి నాకు ఒక చిన్న డౌట్ . అది ఏమిటంటే
అవును. నీవు ఏదేయినా ఒక Variable కు string ను value గా ఇవ్వచ్చు. నీకు ఇది వరకే Variable ను create చేయడం తెలుసు. ఒక వేళా తెలియకపోతే Python Variable ట్యుటోరియల్ ను చుడండి.
ఒక వేరియబుల్‌కు String ను Assign చేయడం : Assign అంటే value ను ఇవ్వడం అని meaning. ఏదైనా ఒక వేరియబుల్‌కు స్ట్రింగ్‌ను Assign చేయడం వేరియబుల్ యొక్క పేరుతో సమాన అంటే = గుర్తు మరియు స్ట్రింగ్తో అవుతుంది.
పైన Example లో a అనే Variable కు "hello" అనే వాల్యూ ను ఇచ్చారు. ఆ తరువాత దానిని ప్రింట్ చేసారు.
మరి నాకు ఒక చిన్న డౌట్. అది ఏమిటంటే
ఏదేయినా ఒక Variable కు ఎక్కువ లైన్స్ ఉన్న string ను value గా ఇవ్వొచ్చా ?
అవును. నీవు ఏదేయినా ఒక Variable కు Multiline Strings ( అంటే ఎక్కువ లైన్స్ ఉన్న string ) ను value గా ఇవ్వచ్చు.
మరి ఈ Multiline String కు సింగిల్ కొటేషన్ గుర్తులు ఇవ్వాలా ? లేదా డబుల్ కొటేషన్ గుర్తులతో ఇవ్వాలా ?
ఇప్పుడు నీవు మూడు డబుల్ కొటేషన్ గుర్తులతో వేరియబుల్‌కు ఎక్కువ లైన్స్ ఉన్న string వాల్యూ ను ఇవ్వాలి. లేదా సింగిల్ కొటేషన్ గుర్తులతో వేరియబుల్‌కు ఎక్కువ లైన్స్ ఉన్న string వాల్యూ ను ఇవ్వాలి.
ఇక్కడ 3 డబుల్ కోట్లను use చేసారు :
ఇక్కడ సింగిల్ డబుల్ కోట్లను use చేసారు :
మీకో గమనిక: Result లో లైన్ బ్రేక్‌లు అనేవి కోడ్‌లో అదే స్థానంలో చేర్చబడతాతాయని గుర్తించుకోండి అంతే.
అనేక ఇతర ప్రసిద్ధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాదిరిగానే, పైథాన్లోని స్ట్రింగ్‌లు యూనికోడ్ అక్షరాలను సూచించే బైట్ల శ్రేణి అని మనం తెలుసుకోవాలి.
అయితే, పైథాన్‌కు character data రకం అనేది లేదు. ఒకే అక్షరం కేవలం 1 పొడవుతో స్ట్రింగ్ ఉంటుంది.
స్ట్రింగ్ యొక్క elements ను యాక్సెస్ చేయడం కోసం స్క్వేర్ బ్రాకెట్లను [ ] use చేయవచ్చు.
string లో స్థానం 1 వద్ద ఉన్న అక్షరాన్ని ప్రింట్ చేయడం (మొదటి అక్షరానికి స్థానం 0 ఉందని గుర్తుంచుకోండి. అంటే ఎప్పుడు కూడా 0 తో స్టార్ట్ అవుతాయి. ):
పైన Example లో a అనే variable లో ఉన్న e అనే ఎలిమెంట్ ను ప్రింట్ చేస్తున్నారు. అయితే print(a[1]) లో a అనేది Variable అని తెలుసు. కానీ బ్రాకెట్ ను ఎందుకు use చేసారు ? ఎందుకంటే ఏదైనా స్ట్రింగ్ యొక్క elements ను యాక్సెస్ చేయడం కోసం దీనిని యూజ్ చేస్తారు. అయితే ఆ బ్రాకెట్ లో 1 ను ఎందుకు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ e అనే ఎలిమెంట్ ను ప్రింట్ చేయాలంటే అది ఉన్న position నెంబర్ ను ఇవ్వాలి. మరి ఇక్కడ e అనే ఎలిమెంట్ position నెంబర్ 1 అవుతుంది. e అనే ఎలిమెంట్ position నెంబర్ 2 కదా అనే డౌట్ ? ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 తో స్టార్ట్ అవుతాయి. నువ్వు దీనిని ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి.
స్ట్రింగ్‌లు arrays కాబట్టి, మనం ఫర్ లూప్‌తో ఒక స్ట్రింగ్లోని అక్షరాల ద్వారా లూప్ చేయవచ్చు. అంటే ప్రతి character ను లూప్ ద్వారా ప్రింట్ చేయవచ్చు.
"Apple" అనే పదంలోని character ద్వారా లూప్ చేయడం :
పైన Example లో ప్రతి character ను for loop చేస్తున్నారు. అంటే ప్రతి character ను 1 by 1 ప్రింట్ చేయడం. దీని గురించి Python For Loop ట్యుటోరియల్ లో మరింత తెలుసుకోండి.
ఒక స్ట్రింగ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా ? దీని కోసం len() ఫంక్షన్‌ని use చేయడం జరుగుతుంది. అంటే స్ట్రింగ్ యొక్క Length ను తెలుసుకోడానికి, len() ఫంక్షన్‌ని ఉపయోగించండి.
ఈ len() ఫంక్షన్ స్ట్రింగ్ యొక్క Length ను provide చేస్తుంది: function returns the length of a string:
len()
పైన Example లో స్ట్రింగ్ యొక్క Length 6 గా ఉంది. అంటే మొత్తం అక్షరాలు 6 ఉన్నాయి. దీని కోసం len() ఫంక్షన్ యూజ్ చేస్తారు.
ఒక స్ట్రింగ్ లో ఏదైనా అక్షరాన్ని గాని లేదా ఒక పదంను గాని అ string లో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?
స్ట్రింగ్‌ని చెక్ చేయడం :
ఏదైనా అక్షరాన్ని గాని లేదా ఒక పదంను గాని అ string లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం in అనే కీవర్డ్ ను use చేస్తారు.
పైన Example లో a అనే స్ట్రింగ్ variable లో "free!" అనే పదం ఉందో లేదో చెక్ చేస్తున్నారు : దీని కోసం print () Parentheses లో 1st చెక్ చేయాలనుకున్న పదాన్ని గాని లేదా అక్షరాన్ని డబుల్ కొటేషన్ గుర్తులతో గాని లేదా సింగిల్ కొటేషన్ గుర్తులతో గాని ఇచ్చి ఆ తరువాత in అనే కీవర్డ్ ను ఇవ్వాలి ఆ తరువాతే చెక్ చేయాలనుకున్న స్ట్రింగ్ variable నేమ్ ను ఇవ్వాలి అంతే.
చివరకు ఇలా ఉంటుంది print("free" in a). ఇప్పుడు true అని ప్రింట్ అవుతుంది. అంటే ఆ స్ట్రింగ్ లో చెక్ చేయాలనుకున్న పదం గాని లేదా అక్షరం గాని ఉంది అని అర్థం. false అని ప్రింట్ అయితే ఆ స్ట్రింగ్ లో చెక్ చేయాలనుకున్న పదం గాని లేదా అక్షరం గాని లేదని అర్థం.
అయితే దీనిని if ను యూజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఈ Example ను చూసి test చేయండి.
Print only if "free" is present:
దీని గురించి Python if .... else ట్యుటోరియల్ లో మరింత తెలుసుకోండి.
స్ట్రింగ్ లో చెక్ చేయాలనుకున్న పదం గాని లేదా అక్షరం గాని లేదని చెప్పడం కోసం not in ను use చేస్తారు.
Check if "expensive" is NOT present in the following text:
పైన Example లో a అనే స్ట్రింగ్ variable లో expensive అనే వర్డ్ లేదని చెప్పడం కోసం not in ను use చేసారు.
ఈ Example ను చూసి test చేయండి.
అయితే దీనిని if NOT ను యూజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. స్ట్రింగ్ లో చెక్ చేయాలనుకున్న పదం గాని లేదా అక్షరం గాని లేదని చెప్పడం కోసం if NOT ను use చేస్తారు.
print only if "expensive" is NOT present:
పైన Example లో a అనే స్ట్రింగ్ variable లో expensive అనే వర్డ్ లేదని చెప్పడం కోసం if NOT ను use చేసారు.