Please log in to earn points for visiting this page.
పైథాన్‌లో మాత్రం 3 సంఖ్యా రకాలు ( అంటే numeric types ) ఉన్నాయి. అవి :
int ( ఇంట్ )
float ( ఫ్లోట్ )
complex ( కాంప్లెక్స్ )
నీవు వాటికి విలువను కేటాయించినప్పుడు సంఖ్యా రకాల వేరియబుల్స్ create చేయబడతాయి.
పైథాన్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ( object ) యొక్క రకాన్ని వెరిఫై చేయడానికి, టైప్() ఫంక్షన్‌ని use చేయాలి. ఈ example ను చుడండి :
Int, లేదా పూర్ణాంకం, అపరిమిత పొడవు గల దశాంశాలు లేకుండా ధనాత్మక ( positive ) లేదా negative ( ప్రతికూలమైన ) పూర్ణ సంఖ్య.
Integers:
పైన అన్ని variables కూడా Int ( ఇంట్ ) Data Type రకానికి చెందినవి.
ఏదైనా ఒక variable యొక్క value ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశాంశాలను కలిగి ఉంటే, అప్పుడు ఆ variable యొక్క value ఫ్లోట్, లేదా "ఫ్లోటింగ్ పాయింట్ నంబర్" అవుతుంది. అ value అనేది positive కావచ్చు or negative అయిన సరే.
Floats:
పైన అన్ని variables కూడా Float ( ఫ్లోట్ ) Data Type రకానికి చెందినవి. ఇక్కడ variables యొక్క value positive ఉన్నాయి మరియు negative కూడా ఉన్నాయి.
ఫ్లోట్ 10 యొక్క power ని సూచించడానికి "e"తో శాస్త్రీయ సంఖ్యలు ( scientific numbers ) కూడా కావచ్చు. ఈ example ను చుడండి :
సంక్లిష్ట సంఖ్యలు ఊహాత్మక ( imaginary )భాగం వలె "j"తో వ్రాయబడాతాయి. ఈ example ను చుడండి :
నీవు ఒక Data Type నుండి మరొక Data Type కు int(), float(), మరియు complex() పద్ధతులతో మార్చుకోవచ్చు.
Example ఒక Data Type నుండి మరొక Data Type కు : x = 1 # int x అనే variable ను int (ఇంట్ ) నుండి float ( ఫ్లోట్ ) కి change చేయాలని నీవు అనుకున్నప్పుడు simple గా : 1 : మరో కొత్త variable ను create చేయాలి. 2 : తరువాత అ variable యొక్క value గా float అని ఇవ్వాలి. పక్కన బ్రాకెట్ [అంటే ఇలా () ] 3 : అ బ్రాకెట్ లో నీవు చేంజ్ చేయాలనుకుంటున్న variable పేరును పాస్ చేయాలి. అంటే చివరకు ఇలా ఉంటుంది : a = float(x)
ఇప్పుడు x అనే variable int ( ఇంట్ ) Data Type నుండి float ( ఫ్లోట్ ) Data Type కు మరిపోయి చివరకు a అనే variable లో store అవుతుంది.
అలాగే ఒక Data Type నుండి మరొక Data Type కు చేంజ్ చేయాలన్నప్పుడు, create చేసే అ కొత్త variable యొక్క value గా నీవు కావలనుకుంటున్న Data Type ను ముందు ఇవ్వాలి అంతే ఆటోమేటిక్ గా ఇచ్చిన Data Type లోకి మారిపోతుంది. ఈ example ను చుడండి :
ఆటోమేటిక్ గా
Convert from one type to another:
మీకో గమనిక : మీరు సంక్లిష్ట ( complex ) సంఖ్యలను మరొక సంఖ్య Type కు మార్చలేరు.
Random ను తెలుగు లో యాదృచ్ఛిక అని అంటారు. నీవు ఒక Number నుండి మరొక Number మధ్య Random గా సంఖ్యలను Display చేయాలనుకుంటే, అప్పుడు : 1 : మొదట Random మాడ్యూల్‌ను import చేయాలి. 2 : తరువాత random అనే కీవర్డ్ ను యూజ్ చేయాలి అంతే.
Random
import
Random సంఖ్యను రూపొందించడానికి పైథాన్‌కు ఎలాంటి random() ఫంక్షన్ అంటూ ఏది కూడా లేదు. అయితే పైథాన్ random సంఖ్యలను రూపొందించడానికి ఉపయోగించే Random గా పిలువబడే built-in module ను మాత్రం కలిగి ఉందని చెప్పవచ్చు.
random()
random
మొదట Random మాడ్యూల్‌ను import చేసుకోండి. తరువాత 1 మరియు 4 మధ్య Random సంఖ్యను Display చేయండి. ఈ example ను చుడండి :
పైన example లో 1 మరియు 4 మధ్య Random సంఖ్యను Display చేస్తున్నారు. ఇలా చేయడానికి : 1 : ముందు Random మాడ్యూల్‌ను import చేశారు. 2 : ఆ తరువాత random అనే కీవర్డ్ ను use చేసి, దాని పక్కన డాట్ ( . ) ను ఉంచి randrange ను use చేసి, బ్రాకెట్ లో వేటి మధ్య Random సంఖ్యను Display చేయాలనుకొన్నారో వాటిని pass చేశారు.
మీరు కూడా పై విదంగా చేసి Random సంఖ్యను Display చేయండి. నీకొ గమనిక : నీవు మా Random module Reference ట్యుటోరియల్ లో దీని గురించి మరింత డీటెయిల్ గా తెలుసుకోవచ్చు.