Please log in to earn points for visiting this page.
python బిల్ట్-ఇన్ మెథడ్స్ కలిగి ఉందని మనకు తెలిసిన విషయమే. ఈ బిల్ట్-ఇన్ మెథడ్స్ ను strings మీద అప్లై చేసుకోవచ్చు.
అసలు బిల్ట్-ఇన్ మెథడ్స్ అంటే ఏమిటి ?
ఆర్య దగ్గర ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్లో పెడల్స్, బ్రేక్‌లు, గేర్లు, హ్యాండిల్ మరియు సిట్ ఉన్నాయి. అయితే ఇవి సైకిల్లోనే అమర్చబడి ఉంటాయని మనకు తెలిసిన విషయమే కదా మిత్రమా ! అయితే వీటిని సపరేటుగా యాడ్ చేయనవసరం లేదు. సరిగ్గా ఇలాగే, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లలో కూడా అప్పటికే యాడ్ చేసిన ఆదేశాల మెథడ్స్ ఉంటాయి. వీటిని సపరేటుగా యాడ్ చేయనవసరం లేదు. వీటినే "బిల్ట్-ఇన్ మెథడ్స్" అని మనం అంటాము. ఇవి ప్రోగ్రామ్‌లోనే ముందుగానే add అయి ఉంటాయి, విటిని సపరేటుగా రాసే అవసరం ఉండదు.
ఇప్పుడు మనం strings మీద అప్లై చేసే కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం.
Upper Case in Python: అప్పర్ కేస్
ఏదైనా ఒక string ను small లెటర్స్ నుండి క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ చేయాలన్నప్పుడు ఈ Upper Case () మెథడ్ ను యూజ్ చేస్తాము.
Upper Case ()
ఇప్పుడు ఒక string variable ను create చేయండి. ఈ string ను small లెటర్స్ నుండి క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ చేయాలన్నప్పుడు
1st : ప్రింట్ మెథడ్ ను టైప్ చేయండి.. ఇలా .. print() 2nd : ప్రింట్ మెథడ్ యొక్క బ్రాకెట్ లో variable name ఎంటర్ చేసి .. తరువాత డాట్ ను ఉంచండి.. ఆ తరువాత ఈ upper case () మెథడ్ ను టైప్ చేయండి.. అంతే లాస్టికి ఇలా ఉంటుంది : print(a.upper())
print()
variable name
upper case ()
print(a.upper())
The upper() method (మెథడ్) క్యాపిటల్ లెటర్స్ స్ట్రింగ్‌ను రిటర్న్ చేస్తుంది :
upper()
Lower Case in Python
ఏదైనా ఒక string ను క్యాపిటల్ లెటర్స్ నుండి small లెటర్స్ లోకి చేంజ్ చేయాలన్నప్పుడు ఈ lower Case () మెథడ్ ను యూజ్ చేస్తాము.
lower Case ()
ఇప్పుడు ఒక string variable ను create చేయండి. ( క్యాపిటల్ లెటర్ తో క్రియేట్ చేయండి ) ఈ string ను క్యాపిటల్ లెటర్స్ నుండి small లెటర్స్ లోకి చేంజ్ చేయాలన్నప్పుడు
1st : ప్రింట్ మెథడ్ ను టైప్ చేయండి.. ఇలా .. print() 2nd : ప్రింట్ మెథడ్ యొక్క బ్రాకెట్ లో variable name ఎంటర్ చేసి .. తరువాత డాట్ ను ఉంచండి.. ఆ తరువాత ఈ lower() మెథడ్ ను టైప్ చేయండి.. అంతే లాస్టికి ఇలా ఉంటుంది : print(a.lower())
lower()
print(a.lower())
The lower() method small లెటర్స్ స్ట్రింగ్‌ను రిటర్న్ చేస్తుంది :
Remove Whitespace :
ఏదైనా ఒక string కి ముందుగాని లేదా string కి string కి మధ్య లేదా string తరువాత వైట్స్పేస్ని అంటే ఖాళీ స్పేస్‌ని Remove చేయాలన్నప్పుడు strip() అనే మెథడ్ ను యూజ్ చేస్తాము.
strip()
ఏదైనా ఒక string కి ముందుగాని లేదా string కి string కి మధ్య లేదా string తరువాత వైట్స్పేస్ని remove చేయాలన్నప్పుడు
1st : ప్రింట్ మెథడ్ ను టైప్ చేయండి.. ఇలా .. print() 2nd : ప్రింట్ మెథడ్ యొక్క బ్రాకెట్ లో variable name ఎంటర్ చేసి .. తరువాత డాట్ ను ఉంచండి.. ఆ తరువాత ఈ strip() మెథడ్ ను టైప్ చేయండి.. అంతే లాస్టికి ఇలా ఉంటుంది : print(a.strip())
print(a.strip())
strip() అనే method ప్రారంభం లేదా ముగింపు నుండి ఏదైనా ఖాళీ స్థలాన్ని Remove చేస్తుంది :
Replace String :
ఏదైనా ఒక string కు బదులు వేరే ఏదైనా ఒక string తో రీప్లేస్ చేయాలనుకుంటే replace() అనే మెథడ్ ను యూజ్ చేయాల్సి ఉంటుంది.
replace()
replace() అనే method ఒక స్ట్రింగ్‌ను మరొక ఏదైనా ఒక string తో స్ట్రింగ్తో భర్తీ చేస్తుంది:
పైన example లో మొదటి వర్డ్ లోని H ను తొలగించి J తో రీప్లేస్ చేసారు. ఇప్పుడు అది కాస్త Hello కు బదులు Jello గా మారిపోయింది.
Hello
Jello
Split String :
ఏదైనా ఒక string ను పదాల పదాలుగా పదాల పదాలుగా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు split() అనే మెథడ్ ను యూజ్ చేయాల్సి ఉంటుంది.
split()
split() అనే method స్ట్రింగ్‌ను సబ్స్ట్రింగ్లుగా విభజిస్తుంది:
పైన example లో a అనే వేరియబుల్ లో ఉండే స్ట్రింగ్‌ను పదాల పదాలుగా పదాల పదాలుగా చేంజ్ చేసారు. ఇప్పుడు అది కాస్త list గా మారిపోయింది. ['Hello', ' World!'] పైథాన్ list గురించి తరువాత వచ్చే ట్యుటోరియల్స్ లో తెలుసుకుంటారు.
list
['Hello', ' World!']
String Methods in Python :
మా స్ట్రింగ్ మెథడ్స్ reference ట్యుటోరియల్స్ లో స్ట్రింగ్ మెథడ్స్ గురించి మరింత ఎక్కువ తెలుసుకోండి..
reference