Please log in to earn points for visiting this page.
ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్‌లో, డేటా రకం అనేది ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ అవుతుంది. అయితే వేరియబుల్స్ వివిధ రకాల డేటాను store చేయగలవు. అంతేకాకుండా వివిధ రకాలైన వేర్వేరు పనులను కూడా ఇవి చేయగలవు.
ఈ వర్గాలలో పైథాన్ ఈ కింది డేటా రకాలను డిఫాల్ట్‌గా అంతర్నిర్మితంగా కలిగి ఉందని గుర్తించుకోండి. అంటే అప్పుడే డిఫాల్ట్‌గా ఉన్నాయని అర్థం. మరి అవి ఏమిటంటే
str
int
float
complex
list
tuple
range
dict
set
frozenset
bool
bytes
bytearray
memoryview
NoneType
అయితే డేటా రకాన్ని ఏవిదంగా తెలుసుకోవాలి ?
మీరు type() ఫంక్షన్‌ని ఉపయోగించి ఏదైనా వస్తువు యొక్క డేటా రకాన్ని చాలా simple గా పొందవచ్చు. అంటే ఈ example ను చుడండి :
type()
Print the data type of the variable x:
x = 5 print(type(x))
నేనే ప్రయత్నిస్తాను ( Try It Myself )
పైన example లో ఒక variable ఉంది. ఇప్పుడు అ variable యొక్క data type ను తెలుసుకోవాలనుకుంటే type() ను use చేయాలి. ఈ ఫంక్షన్ pass చేసిన variable యొక్క data type ను మనకు చెబుతుంది.
అంటే ఏదైనా ఒక variable యొక్క data type ను తెలుసుకోవాలుకున్నపుడు, ముందుగా
()
(x)
చివరగా ఇలా ఉంటుంది : type(x)
type(x)
పైథాన్‌లో అయితే, మనం వేరియబుల్‌కు విలువను కేటాయించినప్పుడు డేటా రకం ఆటోమేటిక్ గా సెట్ చేయబడుతుంది. అంటే మిగతా లాంగ్వేజ్ లో మాదిరిగా variable Name ముందు Data Type mention చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ Java example ను చుడండి :
public class Main { public static void main(String[] args) { String x = "w3badi"; System.out.println("
"); } }
పైన example లో ఒక variable ఉంది. ఇక్కడ
అయితే variable యొక్క value : w3badi కాబట్టి ఇది ఒక string అవుతుంది. అందుకే variable Name ముందు String అనే Data Type ను mention చేశారు.
value : w3badi
int myNum = 15; System.out.println(myNum);
అయితే ఈ example లో variable యొక్క value : 15 గా ఉంది. ఇది ఒక ఇంట్. అందుకే variable Name ముందు int అనే Data Type ను mention చేశారు. అయితే python లో ఈ విదంగా variable Name ముందు Data Type ను mention చేయాల్సిన అవసరం లేదు.
value : 15
ఎందుకంటే మనం వేరియబుల్‌కు విలువను ఇచ్చినప్పుడే డేటా రకం ఆటోమేటిక్ గా సెట్ చేయబడుతుంది. ఇంత వరకు అర్థమైతే చాలు Data Type గురించి మరింత Detail గా మరో ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.