Please log in to earn points for visiting this page.
స్లైసింగ్ స్ట్రింగ్స్ : --
ఏదైనా ఒక స్ట్రింగ్ లో ఒక అక్షరం నుంచి మరో అక్షరం వరకు నీవు print చేయాలనుకుంటే, అప్పుడు Slicing ను యూజ్ చేయవచ్చు. అంటే దీని ద్వారా అక్షరాల శ్రేణిని తిరిగి ఇవ్వవచ్చు.
ఏదైనా ఒక స్ట్రింగ్ లో కొంత భాగాన్ని తిరిగి నీవు print చేయాలనుకుంటే, కోలన్తో వేరు చేయబడిన ప్రారంభ సూచిక మరియు ముగింపు సూచికను పేర్కొనండి.
Get the characters from position 2 to position 5 (not included):
స్థానం 2 నుండి స్థానం 5 వరకు అక్షరాలను print చేయడం (ఇక్కడ 2,3,4వ స్థానం వరకు print చేయడం. 5 చేర్చబడలేదు):
పైన Example లో a అనే variable లో ఇండెక్స్ 2, 3, 4 వరకు print చేస్తున్నారు. నీకు ఏ index నుండి కావాలో అ ఇండెక్స్ నెంబర్ ను బ్రాకెట్ [ ] లో ఇచ్చి కోలన్ ( : ) ఇవ్వాలి. కోలన్ ( : ) తరువాత ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ ను ఇవ్వాలి. చివరకు ఇలా ఉంటుంది print(a [2:5]).
ఇక్కడ 2 అనేది ఏ index నుండి కావాలో అ ఇండెక్స్ నెంబర్ అవుతుంది. కోలన్ ( : ) తరువాత ఉండే ఇండెక్స్ నెంబర్ 5 అనేది ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ అవుతుంది ( ఇండెక్స్ నెంబర్ 5 మాత్రం ప్రింట్ కాదు. 2,3,4 వరకు ప్రింట్ అవుతాయి ).
మీకో గమనిక: మొదటి అక్షరానికి ఎప్పుడు కూడా ఇండెక్స్ నెంబర్ 0 గా ఉంటుంది.
ప్రారంభ ఇండెక్స్ నెంబర్ ను వదిలివేయడం ద్వారా, పరిధి అనేది మొదటి అక్షరం వద్ద నుండి ప్రారంభమవుతుంది:
ప్రారంభం నుండి స్థానం 5 వరకు ఉన్న అక్షరాలను print చేయడం( 5 చేర్చబడలేదు):
పైన Example లో a అనే variable లో ప్రారంభ ఇండెక్స్ నెంబర్ ను వదిలేసి అక్షరాలను print చేస్తున్నారు. అంటే 1st character నుండి 4th character వరకు print చేస్తున్నారు. దీని కోసం
మరి 1st లేదా other ఇండెక్స్ నెంబర్ నుండి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వరకు ప్రింట్ చేయాలంటే ఎలా ? ఒక వేళా నీవు 1st లేదా other ఇండెక్స్ నెంబర్ నుండి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వరకు ప్రింట్ చేయాలనుకుంటే, last ఇండెక్స్ నెంబర్ ను వదిలివేయడం ద్వారా దీనినిప్రింట్ చేయవచ్చు.
ఇక్కడ స్థానం 2 నుండి అక్షరాలను print చేయడం మరియు చివరి వరకు కూడా :
పైన Example లో a అనే variable లో ఇండెక్స్ నెంబర్ 2 నుండి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వరకు ప్రింట్ చేస్తున్నారు. దీని కోసం
స్ట్రింగ్ చివరి నుండి స్లైస్‌ను ప్రారంభించడానికి negative సూచికలను use చేయాలి :
అక్షరాలను పొందండి:
From: "o" in "World!" (position -5)
To, కానీ చేర్చబడలేదు : "d" in "World!" (position -2):
పైన Example లో "World!" అనే స్ట్రింగ్ లో position -5 నుండి position -2 వరకు ప్రింట్ చేస్తున్నారు.