Please log in to earn points for visiting this page.
ఈ సంవస్త్రం లో జరిగిన సేల్స్ పోయిన సంవస్త్రం లో జరిగిన సేల్స్ కంటే ఎక్కువ ఉంటే సేల్స్ మేన్స్ కు జీతాలు పెంచామని మెసేజ్ వెళ్ళాలి. ఒక వేళా ఈ సంవస్త్రం లో జరిగిన సేల్స్ పోయిన సంవస్త్రం లో జరిగిన సేల్స్ కంటే తక్కువ ఉంటే జీతాలు పెంచలేదని మెసేజ్ వెళ్ళాలి. ఇలా చేయడానికి గీత తన ప్రాజెక్ట్ లో... if స్టేట్మెంట్స్ ను యూజ్ చేసింది. అయితే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కోసం మనం if స్టేట్మెంట్స్ ను యూజ్ చేయాలన్నమాట.
ఇప్పుడు పైథాన్ లో ఉండే కండిషన్స్ మరియు If స్టేట్మెంట్స్ గురించి ఉదాహారణలతో తెలుసుకుందాం.
అయితే ఈ పైథాన్ లాంగ్వేజ్ గణితం నుండి సాధారణ తార్కిక పరిస్థితులకు కూడా సపోర్ట్ ఇస్తుంది:
పైన ఉన్న కండిషన్స్ అన్ని కూడా అనేక విధాలుగా యూజ్ అవుతుంటాయి, అయితే సాధారణంగా "if స్టేట్మెంట్లు" మరియు లూప్‌లలో వీటిని యూజ్ చేస్తాం.
if అనే కీవర్డ్ ఉపయోగించి if స్టేట్మెంట్" ఎలా రాయాలి. 1st : if అనే కీవర్డ్ ను రాయండి.. 2nd : కండిషన్ రాసి కోలన్ ను ఇవ్వండి. 3rd : ఇప్పుడు తప్పకుండా ఇండేన్ టేషన్ పాటించి ప్రింట్ స్టేట్మెంట్ ను రాయండి. చివరకు.. మేము if అనే కీవర్డ్ ఉపయోగించి "if స్టేట్మెంట్"రాసినది ఇలా ఉంటుంది. if b > a: print("b is greater than a")
If statement:
పైన ఉదాహరణలో మేము a మరియు b అనే రెండు వేరియబుల్స్‌ని యూజ్ చేసి, b అనేది a కంటే ఎక్కువగా ఉందో లేదో పరీక్షించడానికి if అనే స్టేట్మెంట్ ను యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాము. a=10, మరియు b అనేది 20, 20 అనేది 10 కంటే తక్కువ అని మనకు తెలుసు, కాబట్టి "b అనేది a కంటే తక్కువ" అని ప్రింట్ అయింది.
అయితే కోడ్‌లో స్కోప్‌ను నిర్వచించడం కోసం పైథాన్ ఇండెంటేషన్ (రాసే స్టేమెంట్ ప్రారంభంలో వైట్‌స్పేస్ ను ఇవ్వడం )పై ఆధారపడుతుంది. కానీ ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కనుక చుస్తే తరచుగా దీని కోసం కర్లీ-బ్రాకెట్లను మనం ఉపయోగిస్తాయి.
స్టేమెంట్ ఉన్నప్పుడు, ఇండెంటేషన్ లేకుండా ఉంటే (ఎర్రర్ ను పంపిస్తుంది ) :
ఇప్పుడు మనం elif అనే కీవర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ elif అనే కీవర్డ్ "మునుపటి షరతులు కనుక నిజం కాకపోతే, ఈ కండిషన్ ను ప్రయత్నించండి" అని పైథాన్ లో చెప్పే ఒక మార్గం అని ఇక్కడ చెప్పవచ్చు .
పైన ఉదాహరణలో a b కి సమానం, అందుకే మొదటి షరతు నిజం కాదు, కానీ elif కండిషన్ మాత్రం నిజం, కాబట్టి మేము ఇక్కడ "a మరియు b ఈక్వల్" అని కండిషన్ ఇచ్చి ప్రింట్ చేస్తున్నాము.
అంటే 1st స్టేమెంట్ ( if స్టేమెంట్ ) ట్రూ కాకపోతే అప్పుడు రెండో కండిషన్ ను టెస్ట్ చేయడం కోసం ను రాస్తాము. ఇక్కడ రెండో స్టేమెంట్ అంటే : elif
ఒక వేళా ఇక్కడ రెండో కండిషన్ కూడా ట్రూ కాకపోతే అప్పుడు వేరే కండిషన్ ను రాసి ఏదో ఒక మెసేజ్ ను ప్రింట్ చేస్తాము.
పైన ఉదాహరణలో a అనేది b కంటే ఎక్కువ, కాబట్టి ఇక్కడ మొదటి కండిషన్ ట్రూ కాదు, అదే విదంగా elif కండిషన్ కూడా ట్రూ కాదు. అందుకే మనం వేరే కండిషన్‌కి వెళ్లి "ఏదో ఒక మెసేజ్ ను ప్రింట్ చేస్తాము.
అయితే ఇక్కడ మీరు elif లేకుండా మరొకదాన్ని కూడా యూజ్ చేయవచ్చు అదే Short Hand If :
ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే, అప్పుడు if స్టేట్మెంట్ లాగా అదే లైన్లో రాయవచ్చు.
One line if statement:
ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒకే ఒక స్టేట్మెంట్ను కనుక ఉంటే, ఒకటి మరియు మరొకటి ఉంటే, అప్పుడు అన్నింటినీ కూడా ఒకే లైన్లో రాయవచ్చు :
ఒక లైన్ లో if కండిషన్ రాయడం :
అయితే ఈ సాంకేతికతను మనం టెర్నరీ ఆపరేటర్లు లేదా షరతులతో కూడిన వ్యక్తీకరణలు అని అంటారు.
ఇక్కడ మీరు ఒకే లైన్లో అనేక ఇతర స్టేట్మెంట్లను కూడా రాయవచ్చ.
3 కండిషన్ లతో కూడిన ఒక లైన్ స్టేట్మెంట్ ను రాస్తున్నారు :
ఇక్కడ and అనే కీవర్డ్ లాజికల్ ఆపరేటర్ గా యూజ్ అవుతుంది. అంతే కాకుండా కండిషన్ లతో కూడిన స్టేట్మెంట్లను కూడా కలపడానికి యూజ్ అవుతుంది :
ఇప్పుడు ప్రింట్ స్టేమెంట్ ను రాసి ప్రింట్ చేయండి అంతే..
ఇక్కడ a అనేది b కంటే ఎక్కువ ఉంటే టెస్ట్ చేస్తూ, మరియు c అనేది a కంటే ఎక్కువ ఉంటే అనే రెండు కండిషన్ లను and తో కలిపి టెస్ట్ చేస్తున్నారు :
a
b
c
and
or అనే కీవర్డ్ లాజికల్ ఆపరేటర్ గా యూజ్ అవుతుంది. అంతే కాకుండా కండిషన్ లతో కూడిన స్టేట్మెంట్లను కూడా కలపడానికి యూజ్ అవుతుంది :
1st : మీ మొదటి కండిషన్ ను రాయండి. 2nd : or అనే కీవర్డ్ ను యూజ్ చేయండి. 3rd : మీ రెండో కండిషన్ ను రాయండి. చివరకు ఇలా ఉంది మేము రాసినది .. if a > b or a > c: ఇప్పుడు ప్రింట్ స్టేమెంట్ ను రాసి ప్రింట్ చేయండి అంతే..
ఇక్కడ a అనేది b కంటే ఎక్కువ ఉంటే టెస్ట్ చేస్తూ, మరియు a అనేది c కంటే ఎక్కువ ఉంటే అనే రెండు కండిషన్ లను or అనే కీవర్డ్ తో కలిపి టెస్ట్ చేస్తున్నారు :
or
అయితే ఇక్కడ నాట్ కీవర్డ్ అనే కీవర్డ్ లాజికల్ ఆపరేటర్ గా యూజ్ అవుతుంది. అంతే కాకుండా కండిషన్ తో కూడిన స్టేట్మెంట్ ఫలితాన్ని రివర్స్ చేయడానికి యూజ్ చేస్తారు :
ఇక్కడ a అనేది b కంటే ఎక్కువ కాకపోతే అనే సందర్భం లో టెస్ట్ చేస్తున్నారు :
ఇక్కడ if స్టేట్మెంట్ల లోపల if స్టేట్మెంట్లను ఉన్నప్పుడు, అలాంటి దానిని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లు అని అంటారు.
ఎప్పుడైనా స్టేట్మెంట్లు ఖాళీగా ఉండకపోతే, అప్పుడు కొన్ని కారణాల వల్ల కంటెంట్ లేని if స్టేట్మెంట్ను కలిగి ఉంటే, అలాంటప్పుడు ఎర్రర్ రాకుండా ఉండేందుకు పాస్ అనే కీవర్డ్ ను స్టేట్మెంట్లో రాస్తాము .