Please log in to earn points for visiting this page.
తెలుగులో జావా నేర్చుకోండి
Java programming language ప్రపంచంలో పాపులర్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
మొబైల్ యాప్‌లు, వెబ్ యాప్‌లు, డెస్క్‌టాప్ యాప్‌లు, గేమ్‌లు మరియు మరెన్నో డెవలప్ చేయడానికి ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను యూజ్ చేస్తారు.
మేము w3బడి లో డిజైన్ చేసిన ఈ కోర్ జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్ జావా గురించి తెలియని వారిని దృష్టి లో పెట్టుకొని వారి కోసం మాత్రమే కాకుండా విద్యార్థులు మరియు పని చేసే నిపుణుల కోసం రూపొందించబడింది. జావా ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, క్లాస్ బేస్డ్, సెక్యూర్డ్ మరియు జనరల్ పర్పస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
అసలు జావా అంటే ఏమిటి? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష మరియు ఒక వేదిక. ఇది ఒక హై లెవెల్, ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ మరియు సురక్షితమైన ఒక గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు.
జావా 1995 లో సన్ మైక్రోసిస్టమ్స్ (అయితే ఇది ఇప్పుడు ఒరాకిల్ అనుబంధ సంస్థ) చేత డెవలప్ చేయబడింది. అందుకే జేమ్స్ గోస్లింగ్‌ను జావా పితామహుడిగా పిలుస్తారు. జావాకు ముందు దీని పేరు ఓక్ అని ఉండేది. అయితే ఓక్ అనే పేరును అప్పటికే ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకుంద. అందుకే, జేమ్స్ గోస్లింగ్ మరియు వారి బృందం ఈ పేరును ఓక్ నుండి జావాగా మార్చాడం జరిగింది. అప్పటి నుంచి దీనిని జావా అని పిలుస్తారు.
Application : అప్లికేషన్
కొన్ని రిపోర్ట్ ల ప్రకారం, 3 బిలియన్ పరికరాలు జావాను ఇప్పటికి యూజ్ చేస్తున్నాయంటా!. ప్రస్తుతం ఈ జావా ను ఉపయోగిస్తున్న అనేక పరికరాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని :
అక్రోబాట్ రీడర్, మీడియా ప్లేయర్ మరియు యాంటీవైరస్ మొదలైన డెస్క్‌టాప్ అప్లికేషన్లు ఉన్నాయి. వెబ్ అప్లికేషన్లు అయితే irctc.co.in మరియు javatpoint.com మొదలైన ఉన్నాయి. బ్యాంకింగ్ అప్లికేషన్ల వంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి.
జావా అప్లికేషన్ల రకాలు :
ఈ జావా ప్రోగ్రామింగ్‌ని use చేసి 4 రకాల అప్లికేషన్లను క్రియేట్ చేయవచ్చు అవి :
అసలు స్వతంత్ర అప్లికేషన్ లు అంటే ఏమిటి ?
డెస్క్‌టాప్ అప్లికేషన్లు లేదా విండో-ఆధారిత అప్లికేషన్ల standalone applications అని కూడా అంటారు. అయితే వీటిని మనం ప్రతి మెషీన్లో ఇన్స్టాల్ చేయాల్సిన సాఫ్ట్వేర్. స్వతంత్ర అప్లికేషన్‌కు ఉదాహరణలు మీడియా ప్లేయర్, యాంటీవైరస్ మరియు మొదలైనవి. వీటిని రూపొందించడానికి జావాలో AWT మరియు స్వింగ్ లు ఉన్నాయి.
వెబ్ అప్లికేషన్ అంటే ఏమిటి ?
సర్వర్ వైపు రన్ అయ్యే, అంతే కాకుండా డైనమిక్ పేజీని క్రియేట్ చేసే అప్లికేషన్‌ను వెబ్ అప్లికేషన్ అంటారు. అయితే ప్రస్తుతం, జావాలో వెబ్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి :
ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ బ్యాంకింగ్ అప్లికేషన్లు మొదలైన అప్లికేషన్‌ను ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటారు. అయితే ఇవి హై లెవెల్ భద్రత, లోడ్ బ్యాలెన్సింగ్ మరియు క్లస్టరింగ్ వంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జావాలో, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి EJB లాంటి Technologies ఉన్నాయి.
కేవలం మొబైల్ పరికరాల కోసం క్రియేట్ చేయబడిన అప్లికేషన్‌ను మొబైల్ అప్లికేషన్ అంటారు. అయితే ప్రస్తుతం జావా లో, మొబైల్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి :
జావా ప్లాట్‌ఫారమ్‌లు లేదా ఎడిషన్ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి జావాలో 4 ప్లాట్‌ఫారమ్‌లు లేదా ఎడిషన్లు ఉన్నాయి :
Java SE full form ఏమిటంటే : జావా స్టాండర్డ్ ఎడిషన్
ఇది జావా ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ స్టాండర్డ్ ఎడిషన్ లో java.lang, java.io, java.net, java.util, java.sql, java.math లాంటి మొదలైన జావా ప్రోగ్రామింగ్ API లు ఉంటాయి. ఇందులో ముక్యంగా OOPలు, స్ట్రింగ్, రీజెక్స్, ఇన్నర్ క్లాస్‌లు మరియు మల్టీథ్రెడింగ్, లాంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. I/O స్ట్రీమ్, నెట్వర్కింగ్, AWT, స్వింగ్, రిఫ్లెక్షన్, కలెక్షన్, మొదలైనవి కూడా ఉన్నాయి.
Java EE full form ఏమిటంటే : జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్
వెబ్ మరియు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లను డెవలప్ చేయడానికి use చేసే ఒక ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. కానీ ఇది ముక్యంగా జావా SE ప్లాట్‌ఫారమ్ పైన నిర్మించబడిందని ఇక్కడ చెప్పవచ్చు. అయితే ఇది సర్వ్లెట్, JSP, వెబ్ సర్వీసెస్, EJB, JPA లాంటి మొదలైన అంశాలను కలిగి ఉంటుంది.
Java ME full form ఏమిటంటే : జావా మైక్రో ఎడిషన్ ఇది మొబైల్ అప్లికేషన్లకు అంకితమైన మైక్రో ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు.
అయితే దీనిని రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్లను డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పవచ్చు. అలాగే ఇది తేలికపాటి (అంటే : lightweight ) యూజర్ ఇంటర్ఫేస్ API ని యూజ్ చేస్తుంది.
అయితే జావా ను ఉదాహరణల ద్వారా w3Badi మీకు నేర్పిస్తుంది.
నేనే ప్రయత్నిస్తాను (try it myself)" అనే ఎడిటర్‌తో, మీరు జావా కోడ్‌ని రాసి అప్పటిప్పటికే రిజల్ట్ ను అక్కడే చూసుకోవచ్చు. అంతే కాకుండా మీరు రాసిన జావా కోడ్ ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మరి ఎడిట్ చేసిన జావా కోడ్ యొక్క రిజల్ట్ ను కూడా అక్కడే చూసుకోవచ్చు.
ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి "నేనే ప్రయత్నిస్తాను (try it myself)" అనే టూల్ బటన్‌పై క్లిక్ చేసి చూసుకోవచ్చు.
ఈ జావా ట్యుటోరియల్ మీరు నేర్చుకున్న వాటిని అబ్యాసం కూడా ఇక్కడే చేయవచ్చు. ఇలా అబ్యాసం చేయడం వల్ల మీకు నేర్చుకున్న వాటిపై మంచి పట్టు వస్తుంది.
Java Examples జావా ఉదాహరణలు :
ఈ w3Badi కొన్ని ఉదాహరణల ద్వారా జావా ను మీకు నేర్పిస్తుంది. అయితే ఈ జావా ట్యుటోరియల్ లో అన్ని వివరణలను కూడా స్పష్టమైన ఉదాహరణలతో మీకు వివరంగా తెలియజేస్తుంది.
ఇంకాస్త బేసిక్ జావా పై మంచి పట్టు మీకు రావడానికి ప్రతి టాపిక్ పూర్తియిన తరువాత క్విజ్ ను అందిస్తుంది. దీని వల్ల జావా నైపుణ్యాలు ఎంత వరకు మీకు ఉన్నయో మీరే పరీక్షించ్చుకోండి.