Please log in to earn points for visiting this page.
అవుట్‌పుట్ వేరియబుల్స్ :
ఏదైనా ఒక అవుట్‌పుట్ ను పైథాన్ లో ప్రింట్ చేయడానికి print() function అనేది మనకు అందుబాటులో ఉంది. ఈ ఫంక్షన్ ను యూజ్ చేసి ప్రింట్ చేయవచ్చు. ఎలాంటే :......
print()
ఒక వేళా మీరు డైరెక్ట్ గా ఏదైనా text ను ప్రింట్ చేయాలనుకుంటే "డబుల్ కోట్స్" గాని 'సింగిల్ కోట్స్' లో గాని అ text ను టైప్ చేయండి.
Printing more than 1 variable : 1 కంటే ఎక్కువ వేరియబుల్స్ ను ప్రింట్ చేయడం : మీ దగ్గర x ,y , z అనే ఈ 3 వేరియబుల్స్ ఉన్నాయని అనుకుందాం. మీరు ఈ 3 వేరియబుల్స్ ను ప్రింట్ చేయాలంటే అ ప్రింట్() ఫంక్షన్లో ఉన్న Parentheses () లో ప్రతి వేరియబుల్ name తరువాత కామా, ఇవ్వండి. ఇక్కడ ఉన్న example ను ఒకసారి చూడండి :
Printing multiple variables together :
ఎక్కువ వేరియబుల్స్ ను కలిపి ప్రింట్ చేయడం :
మీరు ఒక వేళా పైన తెలుసుకున్న విధానం లో కాకుండా ఎక్కువ వేరియబుల్స్ ను కలిపి ప్రింట్ చేయాలంటే + ఆపరేటర్ని కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఉన్న ఈ example ను ఒకసారి చూడండి : పైన ఉన్న example లో "Python " మరియు "is " తర్వాత స్పేస్ క్యారెక్టర్ని ఒక్కసారి గమనించండి, అవి లేకుండా output చూసినట్లైతే "Pythonisawesome" అని output వస్తుంది.
ఇప్పుడు మీరు ఏవైనా 1 కంటే ఎక్కువ సంఖ్యల కోసం, + అక్షరం గణిత ఒక ఆపరేటర్‌గా ఇక్కడ పనిచేస్తుంది:
మీరు ఒక వేళా ప్రింట్() ఫంక్షన్లో, ఒక స్ట్రింగ్ మరియు సంఖ్యను + అనే ఆపరేటర్‌తో యాడ్ చేయాలనుకుంటే, పైథాన్ మీకు ఎర్రర్‌ని ఇస్తుంది:
పైన పైన ఉన్న example లో పైథాన్ (Python) మీకు ఎర్రర్‌ని ఇస్తుంది. కాబట్టి ప్రింట్() ఫంక్షన్లో ఎక్కువ వేరియబుల్‌లను అవుట్‌పుట్ చేయడానికి అనువైన మార్గం ఏమిటంటే వాటిని కామాలతో వేరు చేయడం, ఇది వివిధ డేటా రకాలకు కూడా మీకు మద్దతు ఇస్తుంది.