Please log in to earn points for visiting this page.
పైథాన్ ట్యుటోరియల్ : పైథాన్ యొక్క ఇంట్రడక్షన్
పైథాన్ అనేది ఒక ప్రసిద్ధమైన ప్రోగ్రామింగ్ భాష ( popular programming language ). ఈ లాంగ్వేజ్ ను " గైడో వాన్ రోసమ్ ( Guido von Rossum ) " అనే వ్యక్తి చేత సృష్టించబడింది.
" గైడో వాన్ రోసమ్ " డెవలప్ చేసిన ఈ పైథాన్ లాంగ్వేజ్ 1991లో విడుదలైంది.
వీటి కోసం Python ఉపయోగించబడుతుంది : Python is used for these
పై వాటి కోసమే కాకుండా మిగత వాటి కోసం కూడా పైథాన్ లాంగ్వేజ్ ను ఉపయోగిస్తారు. వాటి గురించి ముందు ముందు వచ్చే ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.
ఇప్పుడు పైథాన్ యొక్క ప్రధాన వెర్షన్ పైథాన్ 3 (Python 3). ఈ ట్యుటోరియల్‌లో ఈ పైథాన్ 3 ను మనం use చేస్తాము. అయినప్పటికీ, పైథాన్ 2 అనేది, భద్రతా నవీకరణలు తప్ప మరేదైనా నవీకరించబడనప్పటికీ, ఇప్పటికీ కూడా చాలా ప్రజాదరణ పొందుతూ వస్తుంది.
ఇతర ప్రోగ్రామింగ్ భాషలతో పోలిస్తే పైథాన్ సింటాక్స్ ఎలా బిన్నంగా ఉందని చెప్పవచ్చు ?
పైథాన్ చదవడానికి చాలా సింపుల్ రూపొందించబడింది. అంతే కాదండోయ్ గణిత శాస్త్ర ప్రభావంతో ఆంగ్ల లాంగ్వేజ్ కు కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. మిగతా లాంగ్వేజ్ లలో అయితే ఒక లైన్ పూర్తీ అయిన తరువాత చివరన సెమికోలన్లు ( ; ) లేదా కుండలీకరణాలను ( {} ) ఉపయోగించాలి. కానీ ఒక లైన్ పూర్తీ అయిన తరువాత చివరన సెమికోలన్లు ( ; ) లేదా కుండలీకరణాలు ( {} ) పైథాన్ లో అవసరం లేదు. పైథాన్ మాత్రం ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేయడానికి కొత్త లైన్లను ఉపయోగిస్తుంది. స్కోప్‌ను నిర్వచించడానికి ఈ పైథాన్ వైట్స్పేస్ని ఉపయోగించి ఇండెంటేషన్పై ఆధారపడుతుంది. అంటే లూప్‌లు, ఫంక్షన్లు మరియు తరగతుల పరిధి వంటివి అని అర్తం. మిగతా లాంగ్వేజ్ లలో అయితే తరచుగా ఈ ప్రయోజనం( purpose ) కోసం కర్లీ-బ్రాకెట్ల- {}ను ఉపయోగిస్తాము.