Please log in to earn points for visiting this page.
బూలియన్లు రెండు విలువలలో ఒకదాన్ని సూచిస్తాయి: నిజం లేదా తప్పు. అదేనండి True or False.
ఒక సింపుల్ example తో బూలియన్స్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు లైట్ స్విచ్‌ను ఒకసారి ఊహించుకోండి. అ స్విచ్ అనేది ఆన్‌లో ఉండవచ్చు లేదా ఆఫ్‌లో ఉండవచ్చు అంతేకదా. మరి ఒక వేళ స్విచ్ అనేది ఆన్‌లో ఉంటే true (అంటే నిజం) అని అర్థం. స్విచ్ అనేది ఆఫ్‌లో ఉంటే false (అంటే అపద్దం ) అని అర్థం. అయితే ఇప్పుడు నిన్ను ఎవరైనా లైట్ స్విచ్ ఆన్‌లో ఉందా ? ఆఫ్‌లో ఉందా అని అడిగితే, మీ సమాధానం ఇలా ఉండవచ్చు :
ఇలాగే పైథాన్ ప్రోగ్రామ్‌లలో లైట్ స్విచ్ ఆన్‌లో ఉందా ? ఆఫ్‌లో ఉందా అని అడగలనుకుంటే అప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తాము. ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు లైట్ స్విచ్ ఆన్‌లో ఉంటే అవును అని, లైట్ స్విచ్ ఆఫ్‌లో ఉంటే లేదు అని చెప్పడానికి బూలియన్లు ను ఉపయోగిస్తాయి. ఇవి True or False ను తెలియజేస్తాయి. అంటే :
చివరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బూలియన్స్ అంటే True or False అని.
పైథాన్ లో 2 రకాల బూలియన్ విలువలు ఉంటాయి. అవి : 1. True 2. False మీరిచ్చిన ప్రోగ్రామింగ్ కండిషన్ నిజమైతే True అని ప్రింట్ అవుతుంది. లేదంటే False అని ప్రింట్ అవుతుంది.
Print a message based on whether the condition is True or False:
True
False
వాల్యూస్ మరియు వేరియబుల్స్ ను Evaluate చేయడం. మనం వాల్యూస్ మరియు వేరియబుల్స్ ను Evaluate చేయడం కోసం bool() ఫంక్షన్ ను use చేస్తాము. అయితే ఈ ఫంక్షన్ ఏదైనా విలువను అంచనా వేయడానికి మనకు అనుమతిస్తుంది. ఇదే కాకుండా ప్రతిఫలంగా మనకు True or False ను కూడా ఇస్తుంది,
Evaluate a string and a number:
Evaluate two variables :
చాలా వాల్యూస్ కూడా నిజమైనవి. అంటే ఏదైనా ఒక రకమైన కంటెంట్‌ని కలిగి ఉంటే దాదాపు ఏదైనా విలువ నిజమైనదిగా Evaluate చేయబడుతుందని తెలుసుకోండి.
The following will return True:
నేనే ప్రయత్నిస్తాను ( Try It Myself ) »
నిజానికి False గా evaluate చేయాడానికి మనకు ఎక్కువ వాల్యూస్ ఐతే లేవు. కానీ ఇవి కాకుండా (), [], {}, "", నెంబర్ అయిన 0 మరియు None.. తప్పుగా ఉన్న వాల్యూస్ ను తప్పుగా evaluate చేస్తుంది.
The following will return False:
ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ లేదా ఆబ్జెక్ట్ విషయంలో False గా evaluate చేస్తుంది.
__len__ అనే ఫంక్షన్‌తో ఒక class నుండి తయారు చేయబడిన ఆబ్జెక్ట్ (object) 0 లేదా False ను రిటర్న్ చేస్తుంది.
Functions can Return a Boolean Functions అనేవి ఒక Boolean గా రిటర్న్ చేయగలవు. అయితే మీరు బూలియన్ వాల్యూస్ ను అందించే ఫంక్షన్లను రాయవచ్చు :
Print the answer of a function:
ఫంక్షన్ యొక్క బూలియన్ సమాధానం ఆధారంగా కూడా మీరు కోడ్‌ని రన్ చేయవచ్చు:
ఇక్కడ ఫంక్షన్ కనుక True ను రిటర్న్ చేస్తే Yes అని ప్రింట్ అవుతుంది. ఆలా కానీ సందర్భం లో NO! అని ప్రింట్ అవుతుంది. ఇదే చెబుతుంది క్రింది example ..
పైథాన్ అనేక built-in ఫంక్షన్లను కలిగి ఉంది. అందుకే ఇది బూలియన్ వాల్యూస్ ను అందిస్తుంది. isinstance() ఫంక్షన్ అనే ఫంక్షన్ , ఆబ్జెక్ట్ ఒక నిర్దిష్ట డేటా రకానికి చెందినదో కాదో నిర్ధారించడానికి use చేస్తారు:
ఏదైనా ఒక object పూర్ణాంకామా (integer) కాదా అని చెక్ చేయండి :