Noc Full Form ఏమిటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (No Objection Certificate ) అని అర్థం. ఇది ఒక రకమైన చట్టపరమైన సర్టిఫికేట్ లేదా డాక్యుమెంట్లో ఎవరైతే వివరాలు తెలియజేఉంటారో వారు తమ వివరాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికి ఏజెన్సీ గాని , సంస్థ గాని, ఇన్స్టిట్యూట్ ద్వారా గాని జారీ అవుతుంది. చాలా ప్రభుత్వ సంస్థలకు ఈ సర్టిఫికెట్ చాలా ముఖ్యం.
ఉదాహరణకు : ఇది వ్యాజ్యం, ఉపాధి, వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్ మరియు ఏదైనా ప్రక్రియలో సంబంధిత పక్షం ద్వారా వచ్చిన ఏదైనా అభ్యంతరాన్ని రద్దు చేయడానికి ముక్యంగా ఇలాంటి ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. మీకు తెలుసా ? ఇది న్యాయస్థానంలో అనుకూలంగా గాని లేదా వ్యతిరేకంగా గాని యూజ్ చేయవచ్చు.
Hyderabad లో నివసిస్తున్న రాము అనే వ్యక్తి వేరే రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో రిజిస్టర్ చేయబడిన బైక్ ను కొనుగోలు చేశాడు. ఈ సందర్భంలో, విక్రేత తప్పనిసరిగా Andhra Pradesh ప్రాంతీయ రవాణా అధికారి (RTO) నుండి NOCని పొందాలి. అంతే కాకుండా దానిని Hyderabad లోని వాహనం కొనుగోలుదారుకు అందించాలి.
ఈ NOC (Noc Full Form ) సాధారణంగా Andhra Pradesh లో పేర్కొన్న వాహనంపై ఎటువంటి ముందస్తు ట్రాఫిక్ నేరాలు లేవని మరియు Andhra Pradesh లో వాహనంపై హైపోథెకేషన్ ఉందా లేదా అని పేర్కొనాలి. Hyderabad లో వాహనాన్ని మళ్లీ రిజిస్టర్ చేసుకునే సమయంలో కొనుగోలుదారు ఈ NOC పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.
NOC అనేది డాక్యుమెంట్ లో ఉన్నటువంటి డేటా పై ఒక వ్యక్తికి గాని , ఒక సంస్థకి గాని, ఒక ఏజెన్సీ కి గాని తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని సూచించే చట్టపరమైనటువంటి ఒక డాక్యుమెంట్ ఇది.
ఇది వ్యాజ్యాలకు సంబందించి , విద్యకు సంబందించి, వాణిజ్యం కు సంబందించి, ఇమ్మిగ్రేషన్‌కు సంబందించి మరియు బాధ్యతాయుతమైన పార్టీ ద్వారా ఏదైనా ఫిర్యాదును తటస్థీకరించడం కోసం అనేక ఇతర కారణాల కోసం కూడా ఈ NOC పత్రాన్ని ఉపయోగించకొడానికి వెసులుబాటు ఉంది.
న్యాయస్థానంలో విషయానికి వస్తే , NOC లాంటి చట్టపరమైన పత్రాలు పరిస్థితి(situation) కి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా యూజ్ చేస్తారు. NOC సర్వ సాధారణంగా సంబంధిత పార్టీల గురించి అవసరమైన కొంత సమాచారాన్ని కలిగి ఉంటుంది.
Noc Full Form ఏమిటంటే No Objection Certificate.
మీ వాహనాన్ని ఒక అధికార పరిధి నుండి మరొక అధికారానికి బదిలీ చేయాలనప్పడు మీకు ఇప్పడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(Noc Full Form) అనేది ఉపయోగించబడుతుంది.