జ్ఞానేంద్రియాలు 5 అవి :
ఈ ట్యుటోరియల్ లో జ్ఞానేంద్రియాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు మొత్తం 5. అయితే ఇప్పుడు ఈ ఐదింటి గురించి తీసుకుందాం. అవి :
1. కన్ను (The eye)
2. ముక్కు (Nose)
3. చెవి (Ear)
4. నాలుక (The tongue)
5. చర్మం (Skin)
మన ఇంటికి కిటికీల ఎలాగో ఆ విదంగానే ఈ 5 కూడా మానవ శరీరానికి అంటే మీ బాడీకి (human body) కూడా కిటికీల వలె పనిచేస్తాయి.
1. కన్నునిర్మాణంలో మొత్తం 3 పొరలు ఉంటాయి.
అవి :
కనుపాప మధ్యలో ఉండే గుండ్రటిరంధ్రాన్ని 'తారక' అని పిలుస్తారు. లేదా దీనినే మరో రకంగా ఐరిస్ అని కూడా పిలుస్తారు.
కంటిలో 3వ పొర( అంటే రెటీనా )లో 2 రకాల కణాలు ఉం టాయి.అవి :
కంటిలో ఎక్కువ కాంతి కోసం పని చేసే నరాలను రాడ్స్ అని, తక్కువ కాంతి కోసం పనిచేసే నరాలను కోన్స్ అని పిలుస్తారు. దండకణాలు అనేవి రొడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ( Daily Telugu Taaza News ) (రొడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్ - ఎ అవసరంమవుతుంది ).
అసలు దండకణాలు ఎందుకు అవసరం ?
ఇవి నలుపు, తెలుపు రంగులు చూచుటకు తోడ్పడతాయి దండకణాలు. ఈ దండకణాలు నిశాచర జీవులలో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
నిశాచర జీవులు అంటే ఏవి ? ఏవైతే జీవులు రాత్రి సంచరిస్తాయో ఆ జీవులను నిశాచర జీవులు అని అంటారు. ఉదా- గుడ్లగూబ, గబ్బిలం
→ శంఖుకణాలు ఐడాప్సిన్ అనే ఒక వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఐడాప్సిన్ ఎందుకు అవసరం ? ఈ ఐడాప్సిన్ ప్రాధమిక వర్ణాలైన ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ రంగులను గుర్తించటం కోసం అవసరంవుతాయి.
అంధ చుక్క అంటే ఏమిటి ?
→ దండకణాలు, శంఖు కణాలు లేని ప్రాంతాన్ని అంధ చుక్క అని పిలుస్తారు. కానీ ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు.
కన్ను, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం చేయు శాస్త్రన్ని - ఆప్తమాలజి అని పిలుస్తారు. మన కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏమిటంటే : రెటీనా.
ప్రతిబింబం ఏర్పడటానికి పట్టే సమయం ఎంత ? ప్రతిబింబం ఏర్పడటానికి పట్టే సమయం 1 సెకను కాలం. మన కన్ను గుర్తించగలిగే రంగులు ఎన్ని ? మన కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య : 16 కనుగుడ్డు కదల్చడానికి సహకరించే కండరాల సంఖ్య ఎంత ? కనుగుడ్డు కదల్చడానికి సహకరించే కండరాల సంఖ్య : 6 నేత్రదానం ఇచ్చేవారి నుండి సేకరించే కంటి భాగం ఏది ? నేత్రదానం ఇచ్చేవారి నుండి సేకరించే కంటి భాగం - కార్నియా. మనం పుస్తకం చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవల్సిన కనీస దూరం ఎంత ? పుస్తకం చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవల్సిన కనీస దూరం : 30 సెం.మీ