Domains Name అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ IP అడ్రస్ యొక్క గుర్తింపు అని చెప్పవచ్చు. ఉదా : || ఒక డొమైన్ పేరు w3badi.com అనుకోండి . మరి ఈ domain కి "54.125.127.125" అనే IP అడ్రస్ ను సూచిస్తుంది.
IP అడ్రస్ కి ఒక డొమైన్ పేరు ఎందుకు అవసరం ? ఎందుకంటే IP అడ్రస్ అనేది సంఖ్యల రూపంలో పొడవైన స్ట్రింగ్ ఉంటుంది. ఈ సంఖ్యల రూపం లో కంటే పేరును గుర్తుంచుకోవడం చాలా సులభం కదా మిత్రమా !. search bar లో పొడవైన సుదీర్ఘమైన శ్రేణి కంటే సింపుల్ గా ఉండే ఏదేనా ఒక పేరును ఎంటర్ చేయడం అనేది అందరికి చాలా ఈజిగా ఉంటుంది.
కాబట్టి, ఎవరైనా వ్యక్తులు మీ వెబ్‌సైట్‌ను visit చేయడానికి తమ search bar లో టైప్ చేయాల్సింది మీ వెబ్సైట్ యొక్క వెబ్ అడ్రస్ కానీ IP అడ్రస్ కాదు. చాలా సింపుల్ గా చెప్పాలంటే, మీ వెబ్సైట్ ఒక ఇల్లు అని అనుకోండి , మరి ఆ ఇంటికి Domain Name దాని అడ్రస్ అవుతుంది. మిత్రమా ! ఈ కాన్సెప్ట్ అర్థమైందా ? అర్థమైతే ముందుకు వెళ్ళండి.
మీరు Domain Name ను రిజిస్టర్ చేసేటప్పుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే .com, .net, .org, .edu, మొదలైన వాటిని మినహాయించి 63 కంటే ఎక్కువ అక్షరాలు మీ Domain Name లో ఉండకూడదు. ఉదా : || 1. కరెక్ట్ Domain Name : google.com ఈ డొమైన్ నేమ్ లో .com వదిలేసి మొత్తం అక్షరాలు 63 కంటే తక్కువ అంటే 6 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. 2 . worng Domain Name : googlenamamnnabUANBCVXCHBX.com ఈ డొమైన్ నేమ్ లో .com వదిలేసి మొత్తం అక్షరాలు 63 కంటే ఏక్కువ అంటే 64 అక్షరాలు ఉన్నాయి. మేము చెప్పే విషయం ఏమిటంటే .com, .in, etc ..... వదిలేసి మొత్తం అక్షరాలు 63 కంటే ఏక్కువ ఒక Domain Name లో ఉండకూడదు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా ? అర్థమైతే ముందుకు వెళ్ళండి.
మీరు ఈ కింది ఇమేజ్ ను ఒక్కసారి కనుక గమనిస్తే ఇది ప్రోటోకాల్ మరియు సబ్డొమైన్ తర్వాత URLలో ఎంటర్ చేసారని అర్థమవుతుంది. ఉదా. https://www.google.com ఇందులో https: అంటే Protocol అని , www. అంటే Subdomain అని, .com అంటే టాప్ లెవెల్ డొమైన్ TLD ను చూచిస్తుంది, google.com లో domain and domain suffix రెండు కూడా ఉన్నాయి. మిత్రమా ! ఈ కాన్సెప్ట్ అర్థమైందా ? అర్థమైతే ముందుకు వెళ్ళండి. అసలు domains name ఎలా వర్క్ చేస్తుంది ? మీరు ఏదేనా ఒక వెబ్ బ్రౌజర్లో ఒక డొమైన్ నేమ్ ను ఎంటర్ చేసినప్పుడు, డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS)ని రూపొందించే సర్వర్ల గ్లోబల్ నెట్‌వర్క్‌కు ఒక request వెళుతుంది అది కూడా ఎలా అంటే ఇంటర్నెట్ ఫోన్‌బుక్ లాగా.
సర్వర్ డొమైన్‌కు సంబంధించిన నేమ్ సర్వర్లను సెర్చ్ చేస్తుంది. అంతేకాదు ఆ request ను నేమ్ సర్వర్లకు ఫార్వార్డ్ చేస్తుంది. నేమ్ సర్వర్లు అనేవి పెద్ద కంప్యూటర్లు అని చెప్పవచ్చు. వీటిని హోస్టింగ్ కంపెనీలు మేనేజ్ చేస్తుంటాయి .
హోస్టింగ్ కంపెనీ ( అంటే మీ సైట్ ఎక్కడ స్టోర్ చేసారో అక్కడ అని అర్థం ) వచ్చిన request ను వెబ్ సర్వర్‌కు ఫార్వార్డ్ చేస్తుంది. వెబ్ సర్వర్ అనేది request చేసిన వెబ్ పేజీ ని లేదా సమాచారాన్ని పొందుతుంది. పొందిన వెబ్ పేజీ ని లేదా సమాచారాన్ని తిరిగి బ్రౌజర్‌కు ఫార్వార్డ్ చేస్తుంది.
మరి URL full form ఏమిటి ? URL లో
domains name system ను ఎవరు మేనేజ్ చేస్తారు ? అన్ని డొమైన్ పేర్ల వ్యవస్థను ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) మేనేజ్ చేస్తుంది. మీకు తెలుసా ? ఇది డొమైన్ పేర్ల కోసం విధానాలను రూపొందించడమే కాకుండా వాటిని అమలు చేస్తూ లాభాపేక్ష లేని ఒక సంస్థ.
ICANN అనేది డొమైన్ పేర్లను అమ్మడానికి డొమైన్ నేమ్ రిజిస్ట్రార్ చేసుకొనే కంపెనీలకు అధికారన్నీ ఇస్తుంది. అంతే కదండీ ఇది మీ తరపున డొమైన్ పేర్ల registry కి 1. ఏవైనా మార్పులు చేయడానికి, 2. అన్ని రకాల డొమైన్ పేర్లను అమ్మడానికి, 3. వారి రికార్డులను మేనేజ్ చేయడానికి, 4. వాటిని renew చేయడానికి లేదా ఇతర registrar లకు బదిలీ చేయడానికి, ICANN సంస్థ డొమైన్ నేమ్ రిజిస్ట్రార్ చేసుకొనే కంపెనీలకు allow చేస్తుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక డొమైన్ పేరు ను registrar చేసుకున్నాక ఆ డొమైన్ యజమానిగా మీరు మీ డొమైన్ రిజిస్ట్రేషన్ expire అయ్యే లోపు దాన్ని renew చేసుకోవాలి. ఇప్పుడు అన్ని companies ఒక డొమైన్ పేరు ను కనిష్టంగా 1 ఇయర్ కి registrar చేసుకొనే వెసులుబాటు ను కలిపిస్తున్నాయి. మీకు కావాలంటే ఎక్కువ సంవత్సరలకు registrar చేసుకోవచ్చు.
ఉదా : || కి abcd.com అనే డొమైన్ 1.1.2023 రోజున 1 ఇయర్ కి registrar అయింది అనుకోండి . ఈ డొమైన్ మరో 1 ఇయర్ వరకు కావాలంటే అప్పుడు renew చేసుకోవాలి. అంటే 31.12.2023 లోపు 31.12.2024 వరకు renew చేసుకోవాలి. ఇలా కావాల్సినంత వరకు ఆ డొమైన్ ను renew చేసుకుంటూ ఉండాలి. javatpoint.com గాని లేదా w3schools.com అనే domains అనేక సంవత్సరల నుంచి renew చేసుకుంటూ పోతున్నాయి.