అసలు SEO search engine ఏ విదంగా వర్క్ చేస్తుంది ?
ముందుగా మీరు SEO సెర్చ్ ఇంజిన్ ఏ విదంగా వర్క్ చేస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి.
ఈ search engine యొక్క work మూడు దశలుగా విభజించవచ్చు. అవి క్రాల్ చేయడం ( crawling ), ఇండెక్సింగ్ ( indexing )చేయడం మరియు retrieval చేయడం అంటే తిరిగి పొందడం అని అర్థం.
వరల్డ్ వైడ్ వెబ్‌లోని వెబ్‌పేజీలను findout చేయడానికి ఎదైన సెర్చ్ ఇంజిన్ వెబ్ క్రాలర్లను ఉపయోగించే మొదటి దశే ఈ crawling చేయడం.
కాబట్టి, సెర్చ్ ఇంజిన్లు క్రాల్ చేయడానికి web క్రాలర్లు లేదా స్పైడర్లను కలిగి ఉంటాయి. క్రాలర్ యొక్క వర్క్ ఒక వెబ్ పేజీని
1. visit చేయడం
2. దానిని చదవడం
3. సైట్‌లోని ఇతర వెబ్ పేజీలకు లింక్‌లను Follow చేయడం.
ఈ stage లో, క్రాలింగ్ సమయంలో క్రాలర్ చేసిన వెబ్‌పేజీల కాపీలు సెర్చ్ ఇంజిన్‌కు return చేయబడతాయి. అంతే కాకుండా డేటా సెంటర్లో స్టోర్ చేయబడతుంది. ఈ Copy లను ఉపయోగించి, క్రాలర్ Search engine యొక్క Index ను Create చేస్తుంది.
సెర్చ్ ఇంజిన్ జాబితాలలో మనం చూసే ప్రతి వెబ్‌పేజీలు వెబ్ క్రాలర్ ద్వారా క్రాల్ చేయబడతాయని మరియు Index కు add అవుతాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు website ఉంటె, కచ్చితంగా మీ వెబ్సైట్ ఇండెక్స్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే అది సెర్చ్ ఇంజిన్ పేజీలలో మీ users కి కనిపిస్తుంది.
కాబట్టి, Index క్రాలర్ visit చేసిన వివిధ రకాలైన వెబ్‌పేజీల యొక్క URLని కలిగి ఉంటుంది. అంతే కాకుండా క్రాలర్ సేకరించిన సమాచారాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ సమాచారంత సెర్చ్ ఇంజిన్ల ద్వారా Users కు వారి ప్రశ్నలకు లేదా వారికీ కావలిసిన సంబంధిత సమాధానాలను అందించడానికి చాలా ఉపయోగపడుతుంది.
ఇండెక్స్‌కి web పేజీని జోడించకపోతే, అది Users కు అందుబాటులో ఉండదు. అందుకే ఇండెక్సింగ్ అనేది continuous గా ఉండే ప్రక్రియ. మీకు తెలుసా ? క్రాలర్లు కొత్త డేటాను findout చేయడానికి వెబ్సైట్లను Visit చేస్తూనే ఉంటాయి.
ఎవరైనా ఒక User సెర్చ్ ఇంజిన్ లో అడిగిన ప్రశ్నకు లేదా కావలిసిన దానికోసం ప్రతిస్పందనగా సెర్చ్ ఇంజిన్ specific order లో అత్యంత ఉపయోగకరమైన మరియు సంబంధిత సమాధానాలనే అందించేదే చివరి స్టేజ్ అయినా Retrieval స్టేజ్.
ఈ ఉదా || తో అర్థం చేసుకోండి.
ఇది ఇండెక్స్‌లో ఎంటర్ చేయబడిన పేజీల ద్వారా మారుతుంది. అంతే కాకుండా ఉత్తమమైనదిగా భావించే ఫలితాల మొదటి పేజీలో ఆ వెబ్‌పేజీలను Users కి చూపుతుంది.